Begin typing your search above and press return to search.

ఇది బాబు చేసుకున్న సెల్ఫ్ గోల్ ?

By:  Tupaki Desk   |   16 Nov 2017 5:46 PM GMT
ఇది బాబు చేసుకున్న సెల్ఫ్ గోల్ ?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టైం బాగాలేన‌ట్లుంది. ఇప్ప‌టికే బోటు ప్ర‌మాదం తాలుకూ వివాదం ర‌చ్చ‌ర‌చ్చ అవుతుండ‌గా..మ‌రో క‌ల‌క‌లం దానికి తోడ‌యింది. అదే నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై పలు వ‌ర్గాల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మవుతున్న తీరును చూస్తుంటే..బాబు చేసుకున్న సెల్ఫ్ గోల్ అని చెప్ప‌క త‌ప్ప‌దని ప‌లు వ‌ర్గాలు అంటున్నాయి. చిత్రంగా విమ‌ర్శకుల వాద‌న‌కే మెజార్టీ వ‌ర్గాలు మొగ్గుచూపుతుండ‌టం గ‌మ‌నార్హం. అవార్డుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌నే విమ‌ర్శ‌లు బాహ‌టంగానే వినిపిస్తున్నాయి. ఇక బాల‌య్య న‌టించిన లెజెండ్ మూవీకి ఏకంగా తొమ్మిది నందులు రావ‌డం, మెగా ఫ్యామిలీ హీరోల‌కు ఎవ‌రికీ స‌రైనా గుర్తింపు లేక‌పోవ‌డంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇక గుణశేఖ‌ర్ తీసిన రుద్ర‌మ‌దేవి సినిమాను అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ఆ చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ బ‌హింరంగం గానే ఎపి ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హీరో బాల‌కృష్ణ మూవీ గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణికి ఏపీలో ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చి, త‌న రుద్ర‌మ దేవి మూవీ ఇవ్వ‌క‌పోవడం పై తాను ప్ర‌శ్నించినందుకే నంది అవార్డు ద‌క్క‌లేదంటూ ఆయ‌న వాపోయాడు. తెలుగు చారిత్ర‌క మూవీ తీసిన త‌న‌కు ఈ విధంగా అన్యాయం చేయ‌డం త‌గ‌దంటూ గుణ‌శేఖ‌ర్ త‌న బ‌హిరంగ లేఖ‌లో పేర్కొన్నాడు. మంచి సినిమా తీసినా గుర్తింపు లేన‌ప్ప‌డు ఇక మంచి సినిమాలు చేసి త‌ప్పుచేస్తున్నాన‌నే భావ‌న క‌లుగుతుంద‌ని త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌న వ్య‌క్తం చేశాడు.. ఇక ద‌ర్శ‌కుడు, నిర్మాత బ‌న్నీ వాస్ సైతం మెగా ఫ్యామిలీని నంది అవార్డుల ఎంపిక‌లో విస్మ‌రించారంటూ ఆరోపించాడు.. తాజాగా నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ అవార్డుల ఎంపిక తీరును ఎండ గ‌ట్టాడు.. నంది అవార్దుల కావ‌ని, అవి సైకిల్ అవార్డులంటూ ఫైర్ అయ్యాడు. తాను గతంలో నిర్మించిన ‘గోవిందుడు అందరివాడే’ చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. , ‘‘లెజెండ్’ సినిమా బ్లాక్ బస్టర్ అని నేను ఒప్పుకుంటాను. నా సినిమా ‘గోవిందుడు అందరివాడే’ యావరేజ్ గా ఉండొచ్చు. కానీ, ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించాడు, అతనికి అవార్డు వస్తుందనుకున్నా. జ్యూరీ సభ్యులను ఈ సినిమా మరోమారు చూడాలని కోరుకుంటున్నా అని అన్నాడు. ‘గోవిందుడు అందరివాడే’ కథ బాగుందని ఓ అవార్డు, చిరంజీవికి రఘపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇవ్వడం అన్నది ఏదో కంటితుడుపు చర్యగా అభివ‌ర్ణించాడు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా మ‌గ‌ధీర లో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు అవార్డు రాకుండా అన్యాయం జ‌రిగితే, ఇప్ప‌డు సైకిల్ పార్టీ కూడా గోవిందుడు అంద‌రి వాడు మూవీలో న‌ట‌న‌కు గానూ రామ్ చ‌ర‌ణ్ కు అవార్డు రాకుండా అడ్డుప‌డిందంటూ బండ్ల గ‌ణేష్ ఆరోపించారు. అవార్డుల ఎంపిక‌లో మాత్రం మెగా ఫ్యామిలీకి తీర‌ని అన్యాయం జ‌రిగిందంటూ ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పాడు. మొత్తంగా ప్ర‌భుత్వం ఇచ్చిన అవార్డులు సిని ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమితం కాకుండా కులం రంగు పులుముకొని అందులోనూ ఓ ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాన్ని త‌క్కువ చేసిన‌ట్లు సందేశం ఇచ్చి... బాబు ఇమేజ్‌కు దెబ్బేసిన‌ట్లుగా మారాయ‌ని అంటున్నారు.