Begin typing your search above and press return to search.
వారెవా బాబూ.. ఓవైసీ మోడి మనిషట..
By: Tupaki Desk | 20 Dec 2018 8:14 AM GMTనాలుగేళ్లు అంటకాగాడు.. ఆర్థిక లబ్ధి పొందాడు.. ఇప్పుడు మోడీ అవసరం బాబుకు లేదు. అదే మోడీని బూచీగా చూపి అందరినీ రెచ్చగొట్టే పనికి తెరతీశారు. తాజాగా టీడీపీ పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మోడీని ఎంత తిట్టాలో అంతా తిట్టాడట.. ఏపీలో బీజేపీ సోధిలో లేకున్నా.. ఆయన మీద బాబుగారు యుద్ధం మొదలెట్టారు. ఆయన్ను కార్నర్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని స్కెచ్ గీస్తున్నారు.
మోడీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండి జగన్ - పవన్ చేత నడిపిస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్నటివరకు కేసీఆర్ తో పొత్తుకు అర్రులు చాచి వారు కాదనడంతో కాంగ్రెస్ పంచన చేరిన బాబు ఇప్పుడు కేసీఆర్ కూడా మోడీ బ్యాచే అంటున్నాడు. జగన్ - పవన్ తోపాటు కేసీఆర్ ను కలిపేసి తనను టార్గెట్ చేశారని మొసలికన్నీరు కారుస్తున్నాడు.
ఇక వీరు చాలదన్నట్టు తాజాగా ఏపీలో వేలుపెడుతానని ప్రకటించిన ఎంఐఎం అధినేత ఓవైసీని కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నారు చంద్రబాబు. అసలు ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే అసదుద్దీన్ కు - పక్కా హిందుత్వ మోడీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. వారిద్దరినీ కూడా కలిపేసి బాబు గారు తనకు అనుకూలంగా మార్చుకోవడంపై అందరూ ముక్కున వేలేసేకుంటున్నారు. జగన్ ను - ఓవైసీని కలిపింది మోడీనేనని.. వారి మధ్య అంతకుముందు స్నేహమే లేదంటూ కొత్త వాదనను చంద్రబాబు తెరపైకి తెస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరినీ మోడీ మనుషులుగానే ట్రీట్ చేసే కుట్రకు బాబు గారు తెరతీస్తున్నారు.
ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ ప్రకటించగానే ఆయన పంచన చేరిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలకు ముందు సోనియా - రాహుల్ లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారని వారికి మద్దతిస్తున్నారు. కేసీఆర్ సైతం ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకించారని.. ఆయన ఏపీ పాలిటిక్స్ లోకి రాకముందే విషప్రచారం చేస్తున్నారు.
ఇలా ప్రత్యేక హోదా కేంద్రంగా బాబుగారు ఎన్ని బురిడీ వేషాలు వేస్తున్నారో లెక్కేలేకుండా పోయిందని.. చంద్రబాబుది నాలుకా.. ఇంకేదేమైనా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జనాన్ని మరోసారి మోసం చేసేందుకు బాబు వస్తున్నాడని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాయి.