Begin typing your search above and press return to search.

సామాన్యులకు బాబు గంట టైమిచ్చారు

By:  Tupaki Desk   |   13 Sep 2015 4:27 AM GMT
సామాన్యులకు బాబు గంట టైమిచ్చారు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచారు. అనుక్షణం బిజీగా ఉంటూ.. పార్టీ నేతలతో.. అధికారులతో ఉంటూ సామాన్యులకు దూరంగా ఉండటం తీవ్ర విమర్శలకు కారణమైంది. మొన్నటి వరకూ హైదరాబాద్ లో.. ఆ తర్వాత విజయవాడలో మకాం పెట్టిన బాబు.. ఎప్పుడు.. ఎక్కడ ఉంటారో తెలీని పరిస్థితి. దీంతో.. తమ గోడు చెప్పుకునేందుకు సామాన్యులు..సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఏ మాత్రం సాధ్యం కావట్లేదు.

సామాన్యుల్ని కలవటం.. వారి సమస్యల్ని వినటం.. పరిష్కారాలకు మార్గాలు సూచించటం లాంటివి ఆపేసి బాబు చాలా కాలమే అయ్యింది. ఎవరికి చిక్కకుండా ఉంటున్న బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గత కొద్దిరోజులుగా బెజవాడలో బాబు ఉంటున్నా.. ఎప్పుడు ఉంటారో తెలీటం లేదు. సీఎంను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి.. అధికార నివాసానికి వచ్చినా.. వారికి చంద్రబాబు దర్శనం లభించని పరిస్థితి. దీనిపై ఈ మధ్య కాలంలో విమర్శల తీవ్రత పెరగటంతో.. విషయం చంద్రబాబు వరకూ వెళ్లింది. దీంతో.. మేల్కొన్న చంద్రబాబు వెంటనే చర్యలు ప్రారంభించారు.

తనను కలిసేందుకు వస్తున్న సామాన్యుల్ని కలిసేందుకు చంద్రబాబు.. టైం స్లాట్ ను సెట్ చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం12 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ఇకపై చంద్రబాబు సామాన్యుల్ని కలవనున్నారు. ఆ సందర్భంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని విని.. చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారమే చూస్తే.. చంద్రబాబును 80 మంది కలిశారు. ఈ సందర్భంగా వారు తమ వ్యక్తిగత సమస్యల్ని చెప్పుకున్నారు. కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటారన్న అపప్రద తొలిగేలా.. తాజాగా బాబు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి పనిని ముందే చేస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.