Begin typing your search above and press return to search.

న‌వ్వుతూనే బెజ‌వాడోళ్ల‌కు బాబు చుర‌క‌లు

By:  Tupaki Desk   |   26 Jan 2016 10:30 PM GMT
న‌వ్వుతూనే బెజ‌వాడోళ్ల‌కు బాబు చుర‌క‌లు
X
అటు పార్టీ నేత‌ల‌కు.. ఇటు అధికారుల‌కు.. మ‌ధ్య‌లో ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌లు వినిపించేందుకు వ‌చ్చే వారిపై మండిప‌డుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా బెజ‌వాడ ప్ర‌జ‌ల‌కు కాస్త చురుకుమ‌నే వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. న‌వ్వుతూనే పంచ్ లు వేసిన బాబు.. తానేం చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేయ‌టం విశేషం.

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఇళ్ల అద్దెల నుంచి కాస్ట్ ఆఫ్ లీవింగ్ మొత్తం పెరిగిపోవ‌టం.. భూముల ధ‌ర‌లు భారీగా పెంచేయ‌టం తెలిసిందే.ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు న‌వ్వుతూనే బెజ‌వాడవాసుల తీరును విమ‌ర్శిస్తూ.. తీరు మార్చుకోవాల్సిందిగా కోరారు. తాను హైద‌రాబాద్‌ లో ఉన్న స‌చివాల‌య ఉద్యోగుల్ని విజ‌య‌వాడ‌కు ర‌మ్మ‌ని చెప్పాన‌ని.. దీనికి వారు బెజ‌వాడ‌లో అద్దెలు హైద‌రాబాద్ కంటే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పార‌ని.. కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా ఉంద‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు.

బెజ‌వాడ కాస్మోపాలిటన్ సిటీ కాద‌ని.. మ‌హాన‌గ‌రాల్లో ప‌క్కింటి గురించి ప‌ట్టించుకోర‌ని..కానీ బెజ‌వాడ‌లో మాత్రం ప‌క్కింటి వ్య‌వ‌హారాలు ప‌ట్టించుకుంటారంటూ చుర‌క‌లు అంటించారు. తాత్క‌లిక ప్ర‌యోజ‌నాల గురించి దృష్టిపెట్ట‌కుండా దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల గురించి మాత్ర‌మే ఆలోచించాల‌న్నారు.

బోలెడ‌న్ని అవ‌కాశాలున్నాయ‌ని.. రానున్న రోజుల్లో అమ‌రావ‌తిని ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ న‌గ‌రాల్లో ఐదారు న‌గ‌రాల్లో ఒక‌టిగా చేస్తామ‌ని.. అందుకే కొన్ని విష‌యాల్లో పెద్ద మ‌న‌సు చేసుకోవాల‌న్నారు. చిన్న చిన్న విష‌యాల్లో స‌ర్దుకోక‌పోతే.. శాశ్వితంగా న‌ష్టాలు వ‌స్తాయంటూ వ్యాఖ్యానించారు. చిన్న చిన్న స్వార్థాలు వ‌దిలిపెట్టాలంటూ చుర‌క‌లేశారు. మ‌రి.. బాబు పంచ్ ల‌కు బెజ‌వాడ వాసులు ఎలా రియాక్ట్ అవుతారో..?