Begin typing your search above and press return to search.
పెంకుటింటికి మారనున్న చంద్రబాబు!
By: Tupaki Desk | 28 Jun 2019 5:03 AM GMTనిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో అద్దెకు ఉన్న చంద్రబాబుపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తాయో తెలిసిందే. కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన లింగమనేని వారి ఇంటిని తీసుకున్న ఆయన.. ముఖ్యమంత్రిగా అక్కడే నివాసం ఉంటున్నారు. దాని పక్కనే ప్రజావేదిక పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించింది.
దీంతో ఏపీ సీఎం జగన్.. ప్రజావేదికను కూల్చివేయాలని చెప్పటంతో పాటు.. కరకట్టపైన అక్రమంగా నిర్మించిన యాభై.. అరవై ఇళ్లను కూల్చివేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రజావేదిక తర్వాత కూల్చే ఇల్లు చంద్రబాబు అద్దెకు ఉన్న ఇంటిగా చెబుతున్నారు. దీనికి తోడు ఏపీ అధికారపక్ష నేతలు సైతం అక్రమంగా నిర్మించిన ఇంట్లో ఎలా ఉంటారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాబు ఉండాల్సిన ఇంటికి సంబంధించిన చర్చ టీడీపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఏపీ అధికారపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. వేలెత్తి చూపించేందుకు ఛాన్స్ లేని రీతిలో బాబు ఇంటిని ఎంపిక చేయాలన్న ఆలోచనను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అన్ని వసతులు ఉన్న విలాసవంతమైన భవనంలోకి షిఫ్ట్ అయితే.. రాంగ్ సిగ్నల్స్ పోతాయన్న యోచనలో తమ్ముళ్లు ఉన్నారు.
అత్యాధునిక వసతులున్న ఇంటి నుంచి బయటకు పంపి.. సరైన నివాసం లేకుండా బాబుకు చేశారే? అన్న భావన కలిగేలా తాజాగా ఉండాల్సిన ఇంటికి సంబంధించిన ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు పేరు చెప్పినంతనే విలాసాలకు కేరాఫ్ అడ్రస్ గా.. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారన్న విమర్శ ఉంది.
ఇలాంటివాటికి చెక్ చెప్పేలా తాజాగా ఒక ఇంటిని టీడీపీ నేతలు ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న నివాసానికి దగ్గర్లోనే మాజీ సర్పంచ్ శాంతమ్మ తన పాత పెంకుటిల్లును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 90 ఏళ్ల నాటి పాత పెంకుటింట్లో ఉంటే బాగుంటుందన్న భావనకు టీడీపీ నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
బాబు టేస్ట్ కు తగ్గట్లు కొద్దిగా మార్పులు చేయటంతో పాటు.. ఇంటి చుట్టూ పరిసరాలు కూడా విశాలంగా ఉండటం ఆయన ఓకే అంటారని చెబుతున్నారు. సెక్యురిటీ పరంగా ఇబ్బందులు లేకుండా తాజా పెంకుటిల్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాధమికంగా ఈ ఇల్లు టీడీపీ నేతలు ఓకే చేసినట్లేనని చెబుతున్నారు. అంతిమ నిర్ణయం కోసం బాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒకవేళ బాబు కానీ ఓకే అంటే ఇంటి ఎంపిక విషయంలో బాబు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు అవుతుందని చెప్పకతప్పదు. బాబు లాంటి నేత.. పెంకుటింట్లో ఉండటం సెంటిమెంట్ పండేలా చేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.