Begin typing your search above and press return to search.

బాబు బండారం

By:  Tupaki Desk   |   24 Aug 2016 9:07 AM GMT
బాబు బండారం
X
చంద్రబాబు అంటేనే సర్వేలు - నివేదికలు... పేపర్ వర్క్. ఆయన తన ప్రభుత్వంపైన, తనపైనా కూడా సర్వేలు చేయించుకుంటుంటారు. ఇటీవల మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించిన చంద్రబాబు ఇప్పుడు మరో సర్వే చేయించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే ఎన్ని సీట్లు టీడీపీకి వస్తాయన్న దానిపై చంద్రబాబు ఒక ప్రముఖ సంస్థతో రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. ఆ సర్వే ఫలితాలు చూసి ఆయన షాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 51 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని సర్వేలో వచ్చిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రభుత్వ పనితీరు ఇలాగే ఉంటే రానురాను వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే ఫలితాల్లో తేలిందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారట. రెండేళ్లలోనే ఇంతగా ఎలా మారింది... నష్ట నివారణకు ఏం చేయాలనేది సీనియర్లతో చర్చించారట. మొన్నటి ఎన్నికల్లో తటస్థ ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గారని, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని సర్వేలో తేలినట్టు చెబుతున్నారు.

ఈ సర్వే వివరాలు నిజమే అయితే మాత్రం చంద్రబాబు వెంటనే మేలుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు 51 స్థానాలు మాత్రమే గెలవడం అంటే వచ్చే ఎన్నికలపై చంద్రబాబు ఆశలు వదులుకోవాల్సిందే. ఈ సర్వే ఆధారంగా వెంటనే పరిస్థితి చక్కదిద్ది ప్రజల మనసు చూరగొనకపోతే చంద్రబాబుకు కష్టాలు తప్పవు.