Begin typing your search above and press return to search.

ఇక ఎదగలేడని చంద్రబాబు లోకేశ్‌ ను పక్కన పెట్టేశాడా?

By:  Tupaki Desk   |   7 April 2020 11:50 AM GMT
ఇక ఎదగలేడని చంద్రబాబు లోకేశ్‌ ను పక్కన పెట్టేశాడా?
X
నాయకత్వ లక్షణాలు లేకున్నా.. మాటతీరు లేకున్నా అధికారం ఉంది కదా అని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చారు. అతడికి ఎమ్మెల్సీగా చేసి ప్రభుత్వంలో భాగం చేశారు. దీంతోపాటు పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కొడుకును భుజాన వేసుకుని నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారు. మంత్రిగా చేయడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి చేసి ఇష్టం లేకున్నా పార్టీ శ్రేణులకు లోకేశ్‌ నాయకత్వంలో పని చేసేలా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండడంతో పార్టీ మొత్తం నీవే చూసుకోవాలని ఎమ్మెల్సీ వీవీఎస్‌ చౌదరితో కలిసి లోకేశ్‌ కు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అధికారం ఉంది కాబట్టి లోకేశ్‌ రాజకీయాల్లో కొనసాగాడు. కానీ పరిస్థితులు మారిపోయాయి. రాష్ఠ్రంలో అధికారం కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబుకే పరిస్థితి గడ్డు ఉంది. ఈ క్రమంలో లోకేశ్‌ బయటకు వస్తే ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబు తన కుమారుడిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

అందుకే ఇప్పుడు ఎక్కడా లోకేశ్‌ కనిపించడం లేదు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలో కూడా పెద్దగా లోకేశ్‌ కనిపించలేదు. రాజకీయ నాయకుడిగా ఇంకా ఎదగలేకపోయిన తన కుమారుడి వలన రాజకీయంగా ఎలాంటి లబ్ధి లేకపోవడంతో పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పార్టీలో లోకేశ్‌ వ్యవహరించిన తీరుతో పార్టీకే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు గ్రహించారంట. పార్టీలో వీవీవీఎస్‌ చౌదరికి వయసు మీద పడడంతో అతడు కోపిష్టి కావడంతో అతడిని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశాడు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో లోకేశ్‌ పార్టీలో విబేధాలు తీసుకొచ్చాడని చంద్రబాబు తెలుసుకున్నారు. ఎందుకంటే లోకేశ్‌ కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారంట. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని దగ్గర చేసుకుని మిగతా వారిని దూరం చేయడంతో పార్టీలో అసంతృప్తులు చెలరేగాయి. ఆ వర్గానికి చెందిన యువ నాయకులను చేరదీశాడంట. ఇక పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పార్టీ శ్రేణులు దూరమయ్యారు. ఈ విషయం చంద్రబాబు తెలుసుకునే వారికి పార్టీకి తీవ్ర నష్టం జరిగిపోయింది. ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు లోకేశ్‌ ను పార్టీ బాధ్యతల నుంచి దూరంగా పెట్టేశారంట.

అందుకే ఇప్పుడు చంద్రబాబు నేరుగా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఈ వయసులో పార్టీ బాధ్యతలు మరోసారి స్వీకరించనున్నారు. లోకేశ్‌ తన వారసత్వం తీసుకుంటాడని భావించగా పార్టీకి భారం కావడంతో చంద్రబాబు కలత చెందారు. నాయకుడిగా తన కుమారుడు ఎదగకపోవడంతో చంద్రబాబు తన కుమారుడిని ఇక రాజకీయాల నుంచి పక్కన పెట్టేశారు. ఇప్పుడు వ్యవహారాలన్నీ చంద్రబాబే నడిపిస్తున్నారు.