Begin typing your search above and press return to search.
దా..దా...దావోస్..నో..నో..బాబుస్
By: Tupaki Desk | 18 Jan 2019 1:30 AM GMTరాజకీయాలు చాలా శక్తివంతమైనవి. అవి ఎలాంటి కీలక పరిస్దితులైన మార్చేస్తాయి. భవిష్యత్తు భంగపడుతుందనే నాయకులకు ఇలాంటి రాజకీయాలు మరీ కంగారుపెడతాయి. దీంతో శుభకార్యాలకు హజారవ్వడం సైతం వదులుకుంటారు రాజకీయ నాయకులు. ఇన్నాళ్లు భారతదేశం రాజకీయాలలో ఇదే జరిగింది. అయితే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఏకంగా ఓ అంతర్జాతీయ సమావేశానికే గైర్హాజరు అవుతున్నారు. అది కూడా ప్రతీ ఏట దావోస్ లో జరిగే ప్రతిష్టాత్మక సమావేశం కావడం గమనార్హం. ఈ ఆర్దిక సమావేశంలో పాల్గొనాలంటూ చాలా కాలం క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. ఆయన తన సహచర మంత్రులు - అధికారులు - వందిమాగదులతో కలసి దావోస్ వెళ్లేందుకు ఏర్పట్లు చేసుకున్నారు. దావోస్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నవారు కూడా చంద్రబాబును ఆహ్వానించారు. రా.. రమ్మని పిలిచారు. అయితే బుధవారం జరిగిన రాజకీయ పరిణామాలతో సీన్ మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు కలుసుకున్నారు. వీరిద్దరు ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చలు జరిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో వేడి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కలసి పనిచేస్తాయన్న ప్రస్తుత రాజకీయా పరిస్దితితో తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పెరిగింది. దీంతో సంక్రాంతి వేడుకలలో స్వగ్రామంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన మొత్తం పర్యాటనను రద్దు చేసుకున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగంగా మారుతున్న పరిస్దితులను రాష్ట్రంలోనే ఉండి అంచన వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల రాజకీయాలను ఎదుర్కునేందుకు పగడ్బంది వ్యూహ రచన చేసేందుకు దావోస్ వెళ్లేందుకు కూడా చంద్రబాబు వెనుకంజ వేసారని అంటున్నారు. వైఎస్ జగన్ మోహాన రెడ్డి - కె.తారక రామారావుల సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీలో ఓఆందోళన ప్రారంభమయ్యిందని, దానికి తార్కానమే చంద్రబాబు నాయుడి దావోస్ పర్యాటన రద్దు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దావోస్ పర్యాలటనలో తనకు బదులుగా తన కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు అంటున్నారు. ఇది ఒక విధంగా తన వారసత్వాన్ని ముందుకు తీసుకుని రావడమే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో ఎంతో మందరి సీనియర్ నాయకులు ఉండగా వారిని కాదని తన కుమారుడు లోకేష్ ను పంపడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం.