Begin typing your search above and press return to search.
ఉగాది వేడుకల్లో బాబు మాటలు విన్నారా?
By: Tupaki Desk | 14 April 2021 4:10 AM GMTతిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఏపీ విపక్ష నేత చంద్రబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా.. అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై సెటైర్లు వేస్తున్న ఆయన.. గూడురులో నిర్వహించిన రోడ్ షోలో చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.
గతంలో ప్రత్యర్థులు ఇచ్చే డబ్బులు తీసుకొని.. ఓటు మాత్రం తమకు వేయాలని ప్రచారం చేసేవారు. బాబు మరో అడుగు ముందుకేసి.. వైసీపీ నేతలు ఇచ్చే మందు తాగి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరిన వైనం షాకింగ్ గా మారింది. మద్యంపై అదే పనిగా విమర్శలు చేసే చంద్రబాబు.. మద్యం తాగి ఓటు తమకు ఓటు వేయాలని కోరటం విశేషంగా చెప్పాలి.
ఉగాది నేపథ్యంలో తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన నోటి నుంచి చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు వినిపించాయి. మద్యంతో ప్రతిపేదవాడు అప్పుల పాలవుతున్నారని.. తిరుపతి ఎంపీ స్థానంలో తాను 54 పరిశ్రమలు తీసుకొచ్చానని..వైసీపీ సర్కారు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చిందా? అని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన భారత్ బయోటెక్ వల్లే కరోనా వ్యాక్సిన్ వచ్చిందన్నారు.
దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావును ఎమ్మెల్యేను చేసి మంత్రిని చేశానని.. ఇప్పుడాయన ఎంపీగా మరణిస్తే.. వారి కుటుంబంలోని వారికి అవకాశం ఇవ్వకుండా మరొకరికి టికెట్ ఇవ్వటంతోన.. తాము పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అలిపిరిలో జరిగిన బాంబు దాడులకే భయపడలేదని.. తిరుపతిలోని రాళ్ల దాడుల్ని తాను లెక్క చేయనని పేర్కొన్నారు. అధికారంలో లేకున్నా.. తన గురించి.. తన పాలన గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకుకే బాబు తీరు.. పండుగ రోజు కూడా ఏ మాత్రం మారకపోవటం గమనార్హం.