Begin typing your search above and press return to search.

అనంత నేత‌ల‌కు బాబు బ్రెయిన్ వాష్‌!

By:  Tupaki Desk   |   15 Oct 2017 5:18 AM GMT
అనంత నేత‌ల‌కు బాబు బ్రెయిన్ వాష్‌!
X
ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల పథ‌కాలు, టీడీపీ పాల‌న‌లో అవినీతి ప్ర‌జ‌ల‌కు వివ‌రించి.. వైఎస్సార్ కుటుంబంలో చేర్చ‌డానికి వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి `వైఎస్సార్ కుటుంబం` కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించారు. దీంతో ఖంగుతిన్న సీఎం చంద్ర బాబు.. `ఇంటింటికీ తెలుగుదేశం` అంటూ హ‌డావుడిగా ప్ర‌క‌టించేసి ఈ మూడేళ్ల‌లో చేసిన అభివృద్ధిని వివ‌రించాలంటూ పార్టీ శ్రేణుల‌కు హుకుం జారీచేశారు. ఒకవైపు వైసీపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లు హార‌తులు ప‌డుతుంటే.. మ‌రోవైపు టీడీపీ నేత‌ల‌కు మాత్రం చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. దీంతో తెలుగు త‌మ్ముళ్లు దీనిని లైట్ తీసుకున్నారట‌. ఈ ప‌రిణామాన్ని చంద్ర‌బాబు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. అంతేగాక మొక్కుబ‌డిగా నిర్వ‌హించొద్ద‌ని క్లాసుల మీద క్లాసులు తీసుకుంటున్నార‌ట‌,

త‌మ‌ను వివిధ ప‌థ‌కాల్లో ఎందుకు అర్హులుగా చేర్చ‌లేద‌ని.. డ్వాక్రా రుణ మాఫీ ఎప్పుడు జ‌రుగుతుంద‌ని మ‌హిళ‌లు ఇంటింటికీ టీడీపీలో తెలుగు త‌మ్ముళ్ల‌ను నిల‌దీస్తున్నారు. అన్ని అర్హ‌త‌లు ఉన్నా త‌మ‌కు ఎందుకు పింఛ‌ను అంద‌డం లేద‌ని వృద్ధులు ప్ర‌శ్నిస్తున్నారు.. కానీ అన్నింటికీ టీడీపీ నేత‌ల‌కు మౌన‌మే స‌మాధానమిస్తోంది! ఇంటింటికీ వెళుతున్న టీడీపీ నేత‌ల‌కు రోజూ ఇలాంటి అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. దీంతో నేత‌లు కూడా ఇంటింటికీ తెలుగుదేశం కార్య‌క్ర‌మంపై అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. ఏదో వెళ్లామా వ‌చ్చామా అన్న‌ట్లుగానే నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే.. అనంత‌పురంలో ఈ కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌న జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న సీఎం.. నేత‌ల‌కు త‌న‌ మార్కు క్లాసు పీకార‌ట‌. కార్యక్రమంపై దృష్టి పెట్టకుండా ఏం చేస్తున్నట్లు? అని నేత‌ల‌ను ప్రశ్నించార‌ట‌. నేతల మధ్య విభేదాలు పార్టీని భ్రష్టు పట్టిస్తే సహించేది లేదని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే అనంతపురం జిల్లా నేతల వాదన మాత్రం మరోలా ఉంది. సమాచార లోపం వల్లే సీఎంకు తప్పుడు సమాచారం అందిందనే రీతిలో వారు మాట్లాడుతున్నారట‌. తాము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండటం లేదని, తద్వారా సకాలంలో తమకు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందడం లేదని వారు తెలిపారు. నెట్ వర్క్ సిగ్నల్స్ ఉన్న ప్రదేశం నుంచి తనకు కమ్యూనికేట్ చేయాలని వివరించారు. అందరినీ కలుపుకునిపోవాలని.. విభేదాలు ప‌క్క‌న‌పెట్టాల‌ని సీఎం త‌ర‌చూ చెబుతున్నా.. అవేమీ త‌ల‌కెక్కించుకోవ‌డం లేదు నేత‌లు. గ్రూపు రాజకీయాలతో తరుచూ తగాదాలు, గొడవలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొక్కుబడిగా పనిచేసేవాళ్లు తనకు అవసరం లేదన్నట్లుగానే సీఎం మాట్లాడుతున్నారు. మ‌రి ఇప్పటికైనా వీరు అలసత్వాన్ని వీడతారా? లేదా అన్నది అనుమానమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.