Begin typing your search above and press return to search.
సింధు కోసం స్పెషల్ ఫ్లైట్ పెట్టించిన చంద్రబాబు
By: Tupaki Desk | 23 Aug 2016 7:41 AM GMTఅతిధ్యం ఇవ్వాలన్నా.. వారి మనసుల్ని దోచుకోవాలన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా కార్యక్రమం చేపట్టారంటే దాన్నిభారీగా నిర్వహించేందుకు వెనుకాడరు. విభజన కారణంగా ఉన్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో ‘భారీ’తనానికి ముఖ్యమంత్రులు దూరంగా ఉంటారు. కానీ.. బాబు ప్లానింగ్ వేరుగా ఉంటుంది. డబ్బుల్లేక అప్పుల్లో ఉన్న సర్కారుకు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రానా. చెట్ల కింద కూర్చొని పారిశ్రామికవేత్తలతో మీటింగ్ లు పెడితే.. సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా? అంటూ ఆయన చెప్పే లాజిక్ విన్నప్పుడు.. పేదరికాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదనిపించక మానదు.
బాబులో ఇదో కోణమైతే.. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. భారీతనాన్ని ప్రదర్శించే విషయంలో బాబు ఎక్కడా వెనక్కి తగ్గరు. తాజాగా రియో ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించిన తెలుగమ్మాయి ‘సిల్వర్’ సింధుకు ఏపీ రాజధాని బెజవాడలో సన్మానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సింధును ఘనంగా సత్కరించిన నేపథ్యంలో.. అంతకుమించిన అన్నట్లుగా ఆమెకు తనదైన అతిధ్యంతో మనసు దోచుకునేందుకు చంద్రబాబు భారీ ఏర్పాట్లు చేయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు వీలుగా సింధు కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేటు విమానాన్ని అరేంజ్ చేయటం విశేషం.
అంతేకాదు.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు స్వాగతం పలికేందుకు పలువురు మంత్రులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎయిర్ పోర్ట్ నుంచి బెజవాడ వరకు జరుగుతున్న ర్యాలీకి సింధు.. కోచ్ గోపీల పక్కనే ఉండటం గమనార్హం. అదే సమయంలో బెజవాడలో సింధును చూసేందుకు జనం విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించారు.