Begin typing your search above and press return to search.
చంద్రబాబు సోషల్ మీడియా స్పెషల్ టీం
By: Tupaki Desk | 18 Nov 2015 7:45 AM GMTప్రధాని మోడీ లాగే చంద్రబాబు కోసం కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా అఫైర్స్ టీం ఒకటి తయారవుతున్నట్లు సమాచారం. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ పై వ్యతిరేకత ఎంతగా కలిసొచ్చిందో… సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నరేంద్రమోదీ చేసిన ప్రచారం కూడా అంతే స్థాయిలో కలిసొచ్చిందని వేరే చెప్పనవసరం లేదు. అయితే.. ఐటీ రంగంలో ఎంతో అవగాహన కలిగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రచారం విషయంలో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. సోషల్ మీడియా ప్రచారం విషయం చూస్తే చంద్రబాబు హైటెక్ రేంజికి తగ్గట్లుగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిటీలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయం - ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
రాబోయే కాలం అంతా సోషల్ మీడియాదే అని ఇందులో అవగాహన పెంచుకోవడం కార్యకర్తలకు ఎంతో ముఖ్యమని తెలిపిన చంద్రబాబు మంత్రులు - ఎమ్మెల్యేలనూ ఈ దిశగా నాలెడ్జి పెంచుకోమని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు.. దాన్ని ప్రచార సాధనంగా ఉపయోగించుకునేందుకు ప్రత్యేక టీం రెడీ చేయబోతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీలాగానే చంద్రబాబు తనకోసం, పార్టీ కోసం ఒక టీంను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు కార్యకర్తలు - సాంకేతిక నిపుణులు ఉంటారని చెబుతున్నారు. కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి సోషల్ మీడియాలో తమ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా పార్టీ శ్రేణులపై ఉందని ఏపీ సీఎం ఇప్పటికే పార్టీవర్గాలకు సూచించారు. టెక్నాలజీ - ఇంగ్లీష్ లో అంతంతమాత్రంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు హైటెక్ ఆలోచనలను, సోషల్ మీడియా స్పీడును అందుకోగలరా అన్నది చూడాలి.