Begin typing your search above and press return to search.

రాజ‌ధానిపై చంద్ర‌బాబు లాజిక్కులు మ‌రీ సిల్లీగా ఉన్నాయా!

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:43 AM GMT
రాజ‌ధానిపై చంద్ర‌బాబు లాజిక్కులు మ‌రీ సిల్లీగా ఉన్నాయా!
X
ఏపీకి మూడు రాజ‌ధానులు ఎందుకు వ‌ద్దు.. ఒకే రాజ‌ధాని ఎందుకు ఉండాల‌నే అంశం గురించి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌, చెబుతున్న లాజిక్ లు అసెంబ్లీలో వీగిపోతూ ఉన్నాయి. అసెంబ్లీలో చంద్ర‌బాబు నాయుడు త‌న వాద‌న‌ను వినిపించ‌డానికి వాడిన లాజిక్ లు మ‌రీ సిల్లిగా ఉన్నాయి. అందులో ముఖ్య‌మైన‌ది చంద్ర‌బాబు నాయుడు త‌న ప్ర‌సంగం ఆరంభంలో ప్ర‌స్తావించిన అంశం.

ఏపీ విభ‌జ‌న బిల్లులోని కొన్ని లైన్ల‌ను చ‌దివి వినిపించారు చంద్ర‌బాబు నాయుడు. ఆ బిల్లులో విభ‌జ‌న అనంత‌రం ఏపీకి ప్ర‌త్యేక రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నార‌ని, రాజ‌ధానిని మాత్ర‌మే ఏర్పాటు చేయాల‌న్నార‌ని, రాజ‌ధానుల‌ను కాదు అని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అంటున్న నేప‌థ్యంలో రాజ‌ధానులు కాదు, రాజ‌ధాని కావాల‌ని బిల్లులో పేర్కొన్నార‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అయితే ఇది ఒక సిల్లీ లాజిక్ లాంటిది. రాజ‌ధానులు ఉండాల‌ని ఏ బిల్లులోనూ పేర్కొన‌క‌పోవ‌చ్చు. దేశంలో ఏ రాష్ట్రానికి రెండు రాజ‌ధానులు లేని సంగ‌తి తెలిసిందే. దానికీ ఏపీలో ప్రాంతీయ విబేధాలు త‌లెత్త‌కుండా చూడానికి మూడు రాజ‌ధానుల అంశానికి ఏ మాత్రం సంబంధం లేదు!

అలా చంద్ర‌బాబు నాయుడి మొద‌టి లాజిక్ వీగిపోయింది. అయితే చంద్ర‌బాబు అక్క‌డే మ‌రోర‌కంగా ఇరుక్కున్నారు. ఏపీకి అప్ప‌టిక‌ప్పుడు కొత్త రాజ‌ధాని పెట్టాల‌ని విభ‌జ‌న బిల్లులో లేదు. విభ‌జ‌న త‌ర్వాత ప‌దేళ్ల పాటు ఏపికి హైద‌రాబాదే రాజ‌ధాని. అది బిల్లులో ఉంది. బిల్లు గురించి మాట్లాడిన చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ పదేళ్ల పాటు ఏపీకి రాజ‌ధాని అనే అంశాన్ని కావాల‌ని దాచిన‌ట్టుగా ఉంది.

ఇక ఏపీకి మూడు రాజ‌ధానుల అంశం గురించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కామెంట్ ను స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఇది మ‌రింత సిల్లీగా ఉంది. రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు మ‌నిషి. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు సూచ‌న మేర‌కే ఆయ‌న కాంగ్రెస్ లోకి వెళ్లార‌నే అభిప్రాయాలూఉన్నాయి. అలా పాత ప‌రిచ‌యాల‌తో, పాత సాన్నిహిత్యంతో రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ చంద్ర‌బాబుకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండ‌వ‌చ్చు. అలాంటి రేవంత్ రెడ్డి కామెంట్ ను ఏపీ అసెంబ్లీలో ప్ర‌స్తావించారు చంద్ర‌బాబు. త‌న వాద‌న‌కు అనుకూలంగా ఎవ‌రైనా ప్ర‌ముఖుడి కామెంట్ ను ప్ర‌స్తావించి ఉంటే అదో లెక్క‌. అయితే చంద్ర‌బాబు మాత్రం త‌న స‌న్నిహితుడు రేవంత్ రెడ్డి మాట‌ల‌ను ఉటంకించారు. ఇవీ అసెంబ్లీలో చంద్ర‌బాబు నాయుడి సిల్లీ లాజిక్కులు!