Begin typing your search above and press return to search.
నెహ్రూ ఫ్యామిలీకే భయపడలేదు.. మీరెంత?
By: Tupaki Desk | 28 Jan 2016 12:45 PM GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు తన స్పీడు పెంచారు. రాష్ట్రం విడిపోయినా కలిసి అభివృద్ధి చెందుదామని ప్రతిపాదించారు.. గతంలో తాను చేసిన అభివృద్దిని వివరిస్తూ నైజాం 400 ఏళ్లలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే తాను 9 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశానని చెప్పారు. ఆయన కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపులకు ఎవరూ భయపడరని... చంద్రబాబు - టీడీపీ అస్సలు భయపడవని అన్నారు. టీడీపీ ధైర్యానికి మారుపేరైన పార్టీ అంటూ కార్యకర్తల్లో మరింత ధైర్యం నింపారు.
పటాన్ చెర్వు లో గురువారం జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆకట్టుకునేలా మాట్లాడారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత రెండో ఎన్నికలు జీహెచ్ ఎంసీ ఎన్నికలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే మూడేళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్లమని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు నిజాం పాలకులకు 400 ఏళ్లు పట్టిందని, సికింద్రాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ఆంగ్లేయులకు వందేళ్లు పట్టిందని అన్నారు. తనకు కేవలం తొమ్మదేళ్లే పట్టిందని అన్నారు. ఇందిరాగాంధీ - రాజీవ్ గాంధీ - సోనియాగాంధీకి కూడా భయపడ లేదని అన్నారు. 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లో ప్రపంచ పాటంలోనిలిపానని చెప్పారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటామని అన్నారు.
అధికారం, డబ్బు కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టామని చంద్రబాబునాయుడు అన్నారు. పేదల ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కిందని చెబుతూ టీఆరెస్ డబుల్ బెడ్ రూం ఇళ్ల కంటే ముందే టీడీపీ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని గుర్తుచేశారు. దేశ చరిత్రలో పటేల్ - పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని చెబుతూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చింది తానేనని.. తన వల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. టీడీపీ ప్రజల పక్షానే ఉంటుందని, వెనక్కి వెళ్ల ప్రసక్తేలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయం వేరు.. ప్రభుత్వాలు వేరని అన్నారు. 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించడం సరి కాదని, కేంద్రం సహకారం కావాలంటే టీడీపీ-బీజేపీని గెలిపించాలని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, అవినీతి పెరిగిందని ఆయన విమర్శించారు. తెలంగాణకు టీడీపీకి అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలకు దూరం కాదని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తాను తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గతంలో చేసిన పోరాటాలను గుర్తు చేశారు. తెలంగాణ రైతుల కోసం బాబ్లి ప్రాజెక్టు కోసం పోరాడానని గుర్తు చేశారు. హైదరాబాద్ వల్ల తెలంగాణకు ఎక్కువ లాభం వచ్చిందని అన్నారు. ఔటర్ రింగురోడ్డు - మెట్రో రైలు ఘనత టీడీపీదేనని ఆయన అన్నారు. 12 ఏళ్లైనా మెట్రో పనులు పూర్తి కాలేదని, మేం గెలిచి ఉంటే మూడేళ్లలోపూర్తి చేసేవాళ్లమని అన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం ఎన్టీఆర్ తెచ్చారని అన్నారు. ఇక్కడున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారని, నన్ను విమర్శించే హక్కు వీరికి ఎక్కడిదని అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని... ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటానని అన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు.