Begin typing your search above and press return to search.

గురి త‌గిలింది- బాబును లాక్ చేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   28 Nov 2018 12:10 PM GMT
గురి త‌గిలింది- బాబును లాక్ చేసిన కేసీఆర్‌
X
సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఎక్క‌డ పొత్తు కుదిరినా.... రెండు పార్టీల బ‌లం క‌లిసి విజ‌యం వైపు దారితీయాలి. బ‌హుశా దేశ‌మంత‌టా ఇదే జ‌రిగింది - జ‌రుగుతుంది... ఒక్క తెలంగాణ త‌ప్ప‌. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ గ్ర‌హించ‌లేదు. కానీ చంద్ర‌బాబుకు తెలుసు. అయినా...త‌న పార్టీని బ‌తికించుకోవ‌డం కోసం ఆయ‌న ఆ ర‌హ‌స్యాలేవీ చ‌ర్చ‌కు రాకుండా చాలా చాకచ‌క్యంగా డీల్ సెట్ చేశారు. అయితే, ఎందుకు తెలంగాణ‌లో ఆ సూత్రం వ‌ర్తించ‌దో ఈరోజు బాబు ప్ర‌సంగం విన్న‌వాళ్ల‌కు క‌చ్చితంగా అర్థ‌మ‌వుతుంది. అదే స‌మ‌యంలో... కేసీఆర్ సాధించిన విజ‌యం కూడా అవ‌గ‌తం అవుతుంది.

ఇంత‌కీ స‌భ‌లో చంద్ర‌బాబు ఏం మాట్లాడారో చ‌ద‌వండి... *ప్రజాకూటమి గెలిస్తే తాను తెలంగాణపై ఆధిపత్యం చేయ‌ను. తెలంగాణ నాకు ప్రియ‌మైన ప్రాంతం. నేను ఎప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనే ఉంటాను. ఇక్క‌డ పోటీ చేయ‌ను - పెత్త‌నం కూడా చేయ‌ను* అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు అంద‌రిలో చ‌ర్చుకు దారితీశాయి.

అంటే కేసీఆర్ చంద్ర‌బాబు పెత్త‌నం మ‌న‌కొద్దు. మ‌న‌పాల‌న మ‌నం చేసుకుందాం అని చేసిన ప్ర‌చారం బాగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. ప్ర‌జ‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. అది అర్థం చేసుకున్న చంద్ర‌బాబు చాలా మెత్త‌బ‌డ్డారు. చంద్ర‌బాబు వ‌చ్చి కేసీఆర్ ను చెడుగుడు ఆడ‌కుంటార‌ని పాపం తెలుగుదేశం శ్రేణులు చాలా ఆశ‌లు పెట్టుకున్నాయి. కానీ... కేసీఆర్ బాబు ఇక్క‌డికి రాకుండానే త‌న ప్ర‌సంగాల‌తో బాబు కోర‌లు పీకేశారు. దీంతో బాబు ప్ర‌సంగాల్లో ప‌దును లేకుండా పోయింది. కేసీఆర్‌ ను గ‌ట్టిగా అంటే... ఎక్క‌డ తెలంగాణ సెంటిమెంట్ ప్ర‌భావం ఉంటుందో అని ఆచితూచి మాట్లాడుతున్నారు.

అయితే, ఇది తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మే అవ‌కాశం త‌క్కువ‌. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ. తెలంగాణ వాళ్లే ఎంపీలు - ఎమ్మెల్యేలు అయినా ముఖ్య‌మంత్రుల‌ను - పీసీసీ ప‌ద‌వులను పంచేది ఢిల్లీల‌లోనే. ఎందుకంటే ఆ పార్టీ బాస్‌ లు ఢిల్లీలో ఉంటారు. అలాగే తెలుగుదేశం గెలిచినా - కూటమి గెలిచినా ప‌ద‌వుల పంప‌కం అమ‌రావ‌తిలో - ఢిల్లీలో జ‌రుగుతుంది గాని హైద‌రాబాదులో జ‌ర‌గ‌దు. ఎందుకు... తెలుగుదేశం బాస్ అమ‌రావ‌తిలో ఉంటారు కాబ‌ట్టి. అందుకే కూట‌మిలో టీడీపీ చేర‌డం ప్ర‌జాకూట‌మి మొత్తానికి చేటు. అందుకే బాబు-రాహుల్ పొత్తు... కేసీఆర్ బ‌లం పెంచిందే గాని త‌గ్గించ‌లేదు అంటున్నారు. అంతో ఇంతో కోదండ‌రాం వ‌ల్ల మాత్రం ఆ పొత్తుకు ఒక శాంక్టిటీ ఏర్ప‌డిందంటున్నారు విశ్లేష‌కులు.

ఇక రాహుల్ తో పాటు ప్ర‌సంగంచిన చంద్ర‌బాబు... ప్ర‌సంగమంతా వివ‌ర‌ణ‌ల‌తోనే స‌రిపెట్టారు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకుంటుందని ఆయన ప్రశ్నించారు. తాను అప్పుడు ఇప్పుడు ఒకే మాట మాట్లాడుతున్నానని అన్నారు. కేసీఆర్ తనను పదే పదే తిడుతున్నారని... ఇది న్యాయమా అని ఆవేద‌న‌గా ప్రశ్నించారు. జాతీయస్థాయిలో రెండే కూట‌ములు ఉన్నాయి.. ఒక‌టి కాంగ్రెస్ - ఇంకోటి బీజేపీ. కేసీఆర్ ఎటు వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా తెలంగాణ ఎన్నిక‌ల గురించి మాట్లాడ‌మంటే... ఎపుడో వ‌చ్చే లోక్‌ స‌భ ఎన్నిక‌ల పొత్తుల గురించి చంద్ర‌బాబు మాట్లాడ‌టం విడ్డూరం.