Begin typing your search above and press return to search.

షూటింగులకు వైజాగ్‌ రండి: బాబు

By:  Tupaki Desk   |   10 April 2015 7:52 AM GMT
షూటింగులకు వైజాగ్‌ రండి: బాబు
X
తెలుగు చిత్రసీమ వైజాగ్‌ తరలిపోతోంది. ఎప్పటికప్పుడు సినిమా వర్గాల్లో నలుగుతున్న ఆసక్తికర టాపిక్‌ ఇది. వైజాగ్‌ ప్రధాన కేంద్రం అవుతుంది. అక్కడినుంచి అరకు, రాజమండ్రి, కోనసీమ కేవలం 3గంటల ప్రయాణ దూరంలోనే ఉన్నాయి కాబట్టి విశాఖ నగరానికే సినిమా పరిశ్రమ అనుకూలం అని సినీపెద్దలు కొందరు ముచ్చట్లాడుకోవం వింటూనే ఉన్నాం. అయితే నిన్నటి రోజున బాలకృష్ణ 'లయన్‌' ఆడియో వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. అందులో ఏపీని నంబర్‌-1 చేస్తానని శపథం చేశారు. అంతేకాదు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లోనే కాదు, ఏపీలోనూ అభివృద్ధి చేస్తాం అన్న కసి అతడి కళ్లలో కనిపించింది. మాటల్లో ధ్వనించింది. వైజాగ్‌, కోనసీమ, రాజమండ్రిలోనూ షూటింగుల్ని విరివిగా చేయండి. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ రకంగా సినీపరిశ్రమ నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా రూ.2500కోట్లు (ఏడాదికి, విదేశీ పర్యాటకం అదనం) తమ ఖాతాలో జమేసుకునేందుకు బాబు ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడా? అనిపించింది. భవిష్యత్‌ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల నుంచి ఓట్లను టీడీపీ కొల్లగొట్టాలంటే తమ ముందు ఉన్న తరుణోపాయం సినిమా పరిశ్రమ. ఇండస్ట్రీని విశాఖలో నెలకొల్పుతామని అంటే చాలు. ఆ క్రేజుతో ప్రజల ఓట్లు కూడా తన ఖాతాలోనే ఉంటాయని బాబు భావిస్తున్నారు. అందుకే ఈ ఉద్వేగ పూరితమైన ప్రసంగంలో సినిమా పరిశ్రమని టార్గెట్‌ చేశారన్నమాట!