Begin typing your search above and press return to search.
ఆ తప్పు మళ్లీ చేయొద్దంటున్న బాబు!
By: Tupaki Desk | 5 Oct 2016 7:20 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు గతం నెమరువేసుకున్నారు. ఆనాటి తప్పులు పునరావృత్తం చేయవద్దని స్పష్టంచేస్తూ ఫలితాలు ఎలా ఉంటాయో తమ్ముళ్లకు వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ వర్శిటీలో మూడ్రోజుల పాటు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శిక్షణాతరగతుల్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుని హోదాలో చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఈ మూడ్రోజుల శిక్షణలో నాయకత్వ సాధికారతపై చర్చిస్తారు. భవిష్యత్ లో అనుసరించాల్సిన ప్రణాళికల్ని రూపుదిద్దుతారు. ప్రజాప్రతినిధుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు వ్యూహాలు సిద్ధం చేస్తారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల్తో పాటు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రాని కొనగూరే ప్రయోజనాలపై ప్ర జాప్రతినిధులకు - పార్టీ నాయకులకు అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్పష్టమైన సూచనలు చేశారు.
ప్రభుత్వంలో ఉన్నామనే మితిమీరిన ఆత్మవిశ్వాసమొద్దు.. అభివృద్ధి సంక్షేమ పథకాల్ని అమలు చేయడమేకాదు.. వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలి.. తగిన ప్రచారం కల్పించాలి.. లేనిపక్షంలో చేసిన వాటికి విలు వుండదు.. 2004కు ముందు పదేళ్ళ పాటు దేశంలోనే మరే రాష్ట్రం కనీసం కలలో కూడా ఊహించనన్ని అభివృద్ధి - సంక్షేమ పథకాల్ని అమలుచేసి చూపించాం.. రాష్ట్రాన్ని ప్రగతిబాటలో పరుగులు పెట్టించాం.. ఈ పనులే తిరిగి అధికారం లోకి తెస్తాయని అతివిశ్వాసాన్ని ప్రదర్శించాం.. ఆరు మాసాల ముందు మేల్కొని హడావుడిగా ప్రచారం నిర్వహించినా ఫలితాలు మాత్రం మనకు వ్యతిరేకంగా వచ్చాయి. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పదేళ్ళు పట్టింది.. అదికూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు - నీతిబాహ్య పనులపై క్షేత్రస్థాయి నుంచి ప్రజా ఉద్యమాలు నిర్మించి కాంగ్రెస్ నైజాన్ని బట్టబయలు చేయగలగడం వల్లే ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలిగే శక్తి ఒక్క తెలుగుదేశానికే ఉందన్న నమ్మకాన్ని కల్పించగలిగాం. అని చంద్రబాబు తెలిపారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజాసమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్న నమ్మకాన్ని కల్పించగలిగాం.. విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్ కు పూర్వవైభవం సాధించగలిగే శక్తి - సామర్ధ్యం - నిజాయితీ నిబద్ధతతో కూడిన పాలన ఒక్క తెలుగుదేశానికే సొంతమన్న భావనను ప్రజల్లో పాదుకొల్పగలిగాం.. ఈ కారణంగానే తిరిగి అధికారంలోకొచ్చాం.. ఇప్పటికే దాదుపు రెండున్నరేళ్ళు పూర్తయింది… రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు మించి అభివృద్ధి సాధించాం.. కేంద్ర సగటుకంటే దాదాపు రెండురెట్లు అధికంగా ఉత్పత్తిలో వృద్ధి నమోదు చేశాం..విద్య - ఆరోగ్యాల నుంచి అన్ని రంగాలకు విశేష ప్రాధాన్యతనిస్తున్నాం.. జలవనరులకు పెద్ద పీటేశాం..అంతమాత్రాన సరిపోదు.. ప్రజలకు సంక్షేమం - అభివృద్ధి కల్పించడమేకాదు.. దీనిపై క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా ప్రచారం చేయాలి.. ఇప్పట్నుంచే శ్రేణుల్ని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం తాను రోజూ 18గంటలు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పారు. ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో తిరిగి ముందంజవేయించగలిగానన్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే గడువులోగా నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలోపెట్టుకునే కేంద్రంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రయోజనాల విషయంలో తానెలాంటి రాజీపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. హోదా కోసం ప్రయత్నం కొనసాగిస్తామన్నారు. ప్యాకేజీ ద్వారా కల్పించే ప్రయోజనాల్ని తక్కువగా అంచనాలేయాల్సిన అవసరంలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపధ్యంలో ప్యాకేజీ ద్వారా సమకూరే ప్రయోజనాలు అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వంపై కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ నాయకులు, శ్రేణులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/