Begin typing your search above and press return to search.
అదేంది బాబు. అన్నేసి మాటలు అనేశారా?
By: Tupaki Desk | 16 Jan 2017 4:52 AM GMTగతంలో లాంటి పరిస్థితి లేదు. పెరిగిన టెక్నాలజీ.. అందుబాటులోకి ప్రసార సాధనాల పుణ్యమా అని ప్రముఖల నోటి నుంచి ఏ చిన్న తేడా మాట వచ్చినా.. దానికి తాటాకులు కట్టేసి జరుగుతున్న ప్రచారం అంతాఇంతా కాదు. మంచి కానీ.. చెడు కానీ ప్రముఖులకు సంబంధించిన ప్రతి అంశాన్ని వీడియోలుగా మార్చేయటం దాన్ని యూట్యూబ్ లో పెట్టేయటం ఇప్పుడు జరుగుతోంది.
ఇలాంటి వేళ ప్రముఖులు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తమ మాటల్ని ముక్కలు ముక్కులుగా చేసి.. వాటిని ఏర్చి కూర్చి.. వివాదాలకు నెలవుగా మార్చే ధోరణి కూడా పెరుగుతోంది. తాజాగా అలాంటి ప్రయత్నమే మరోసారి జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వచ్చే తలనొప్పి ఏమిటంటే.. ఆయన రెండు విషయాల్ని లింక్ చేసి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు మాటలు కొన్ని వచ్చేస్తుంటాయి. వీటిని మొత్తంగా వింటే.. ఆయన భావం ఏమిటో అర్థమవుతుంది.
కానీ.. ముక్కలుగా చేసి వింటే మాత్రం అవన్నీ వివాదాస్పద వ్యాఖ్యలుగా మిగులుతుంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే రీతిలో ఉన్నాయని చెప్పాలి. సంక్రాంతి పండక్కి సొంతూరు వెళ్లిన చంద్రబాబు.. అక్కడే రెండు రోజులు గడిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సొంతూరును మరచిపోవద్దంటూ ఆయన పిలుపునివ్వచ్చారు.
అమ్మను.. జన్మభూమిని మర్చిపోకుండా సేవలు చేయాలని పేర్కొంటూ ఆయనో కార్యక్రమాన్నే నిర్వహిస్తున్నారు. గతంలో తాను పని.. పని అనుకునేవాడినని కానీ.. ఇప్పుడు అది తప్పు అన్న విషయం తెలుసుకున్నానని చెబుతున్నారు. ‘‘గతంలో ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయని అధికారుల్ని పరుగులు పెట్టించా. కానీ అది తప్పు అని తెలుసుకున్నా. చేసే పని ఎంతైనా తృప్తిగా చేస్తేనే పలితాలు వస్తాయి అని గుర్తించా. అందుకే నచ్చిన పనిని ఆనందంగా చేయాలని ఇప్పుడు పిలుపునిస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇన్ని మాటలు మాట్లాడిన చంద్రాబాబు వివాదాస్పదంగా మాట్లాడినట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థలు చెబుతున్న కథనం ప్రకారం బాబు మాటలు ఇలా ఉన్నాయని చెబుతూ.. ‘‘పని మీద అంకిత భావం ఉండదు. నిర్లక్ష్యం ఎక్కువ. సామాజిక కోణాలు పట్టించుకోరు. అక్కడ వ్యవస్థలు పటిష్టంగా ఉండబట్టి సరిపోయింది. లేకుంటే మనోళ్లు సింగపూర్.. అమెరికాలను సైతం నాశనం చేస్తారు’’ అంటూ ప్రవాస భారతీయులపై ఘాటైన విమర్శలు చేశారని పేర్కొన్నారు.
విదేశాల్లో వ్యవస్థలపట్ల నిబద్ధతతో ఉండే ఎన్ ఆర్ ఐలు.. స్వదేశానికి వచ్చిన వెంటనే సామాజిక కోణం విస్మరించి విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు విమర్శించిన వైనాన్ని ప్రముఖంగా అచ్చేశారు. నిజానకి బాబు మాటల్లో సంచలన వ్యాఖ్యలు ఏమీ లేవనే చెప్పాలి. ఇలాంటి మాటల్నే ప్రతి ఒక్కరూ అంటారని మర్చిపోకూడదు. విదేశాల్లో ఆచితూచి వ్యవహరించే వారు.. సొంత దేశంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం చూస్తున్నదే. ఇది ఇక్కడి వ్యవస్థ లోపమన్నది మర్చిపోకూడదు. వ్యవస్థ కచ్ఛితంగా ఉంటే.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటారని మర్చిపోకూడదు. వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపిన చంద్రబాబు మాటల్ని.. వ్యక్తులకు అపాదించేలా ట్విస్ట్ చేసి రాశారన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఏమైనా.. మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం బాబుకు ఉందని చెప్పాలి. లేదంటే.. అనవసరమైన ఇష్యూలో ఆయన ఇరుక్కుంటారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/