Begin typing your search above and press return to search.

బాబు అడుక్కుంటే ఎంత వచ్చిందో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Jan 2020 11:15 AM GMT
బాబు అడుక్కుంటే ఎంత వచ్చిందో తెలుసా?
X
సాధారణంగా ఓ గుడి వద్దో లేక ఏదైనా ఫుట్ పాత్ పై బిచ్చగాడు రోజంతా అడుక్కుంటే ఎంతొస్తుంది..? వందో రెండు వందలో.. కానీ ఒక పార్టీకి అధినేత.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 15 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు జోలెపట్టి అడిగితే ఎంత వచ్చిందో తెలుసా.? మీరు కళ్లు బైర్లు కమ్మే మొత్తమే చంద్రబాబు సంపాదించారు.

అమరావతి పరిరక్షణ సమితి పేరిట చంద్రబాబు జోలెపట్టి రాష్ట్రమంతటా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. రాజధానిని నిలుపుదల చేసుకునేందుకు ఉద్యమ ఖర్చుల కోసం బాబుగారు ఇలా విరాళాలు సేకరిస్తున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి మొదట తన రెండు బంగారు గాజులు ఇచ్చి ఈ ఉద్యమానికి విరాళాలను మొదలుపెట్టింది. చంద్రబాబు లక్ష విరాళంగా అందజేశారు. టీడీపీ నేతలు, పారిశ్రామికవేత్తలు, బాబు కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా విరాళాలు అందజేశారు.

ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో చంద్రబాబు విరాళాలు సేకరించారు. ఇలా ఇప్పటిదాకా రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.57 కోట్లు విరాళాల రూపంలో సేకరించానని చంద్రబాబు తెలిపారు. ఇలా ఆఫ్ లైన్లోనే కాదు.. ఆన్ లైన్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చని బాబుగారు ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చారు. ఇలా చంద్రబాబు లాంటి పెద్ద నేత జోలెపడితే అన్ని కోట్లు వచ్చిపడడం చర్చనీయాంశంగా మారింది.