Begin typing your search above and press return to search.
బోటు ప్రమాదంపై బాధ్యత లేదా బాబూ!
By: Tupaki Desk | 14 Nov 2017 7:02 AM GMTఏపీలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. కార్తీక మాసం వన సమారాధన కోసం ఒంగోలు వాకర్స్ క్లబ్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారు.. సీఎం చంద్రబాబు భారీ ఎత్తున ప్రచారం చేసిన పవిత్ర సంగమ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుని - బోటెక్కారు. అయితే, ఇది ప్రైవేటుది కావడం - దీనికి అనుమతి లేకపోవడం - డ్రైవర్ కొత్తకావడం వంటి విషయాలు వారికి ఎలా తెలుస్తాయి? దీంతో వారంతా మనిషికి 300 చొప్పున చెల్లించి పవిత్ర సంగమానికి బయల్లేరి మధ్యలోనే మృత్యువాత పడ్డారు. ఘోర ప్రమాదం జరిగి అయిన వారికి కాకుండా పోయారు. మరి ఇంత ప్రమాదం జరిగితే.. బాధ్యతాయుతమైన ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందని ఎవరైనా ఆశిస్తారు? ఈ ప్రమాదానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అనుకుంటారు?
నిజానికి అందరూ బాబు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని - ఓ ప్రకటన చేస్తుందని అందరూ ఆశించారు. అయితే, సీఎం చంద్రబాబు మాత్రం ఈ విషయం నుంచి నైస్ గా తప్పించేసుకున్నారు. దీనికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? అనే రేంజ్ లో ఆయన మాట్లాడారు. దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపివేసినా.. చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వంపై మరక పడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో ఇదే అంశంపై మాట్లాడుతూ.. పవిత్ర సంగమం సమీపంలో బోటు కుదుపులకు లోను కావడంతో డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పాడని, దీంతో పర్యాటకులంతా ఓ వైపుకు వచ్చారని, భారం పెరిగి బోటు బోల్తా పడిందని సీఎం వివరించారు.
అంతేకాదు, బోటు ప్రయాణించిన తీరు చూస్తుంటే డ్రైవర్ కు ఆ మార్గంపై సరైన అవగాహన లేనట్లుగా తెలుస్తోందన్నారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, ఇది తప్పకుండా బోటు నిర్వాహకుల బాధ్యతా రాహిత్యమేనని పేర్కొంటూ.. నైస్ గా ప్రభుత్వ బాధ్యత ఏమీలేదని చెప్పేశారు. అయితే, ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అసెంబ్లీలో బాబు కన్నా ముందు మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏపీ టూరిజం అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి బాధ్యతా రాహిత్య ప్రవర్తన వల్లే.. ప్రమాదం జరిగిందని - లైసెన్సు - అనుమతులు లేని బోటును నదిలోకి ఎలా వెళ్లనిచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల మాత్రం అధికారులది బాధ్యత అని చెప్పడం గమనార్హం.
మరి దీనిని బట్టి.. అధికారులను నియంత్రించాల్సిన బాద్యత ప్రభుత్వంపై లేదా? సంబంధిత పర్యాటక మంత్రికి లేదా? అయినా.. ఆదివారం.. అందునా.. కార్తీక మాసం.. కావడంతో పర్యాటకులు పోటెత్తుతారని వారికి తెలియదా? అలాంటప్పుడు మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదా? మరి ఇదంతా ఎవరి బాధ్యతో చంద్రబాబే చెబితే బాగుండేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అధికారం చేపట్టిన కొత్తలో గోదావరి పుష్కరాల తొలిరోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 27 మంది మృతి చెందారు. దానికి కూడా ఇప్పటి వరకు ఎవరి బాధ్యతా ప్రకటించలేదు. మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకో చంద్రబాబే సెలవివ్వాలనే విమర్శలు వస్తున్నాయి.