Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌కు రాజ‌ధాని క‌ళ‌క‌ళ‌

By:  Tupaki Desk   |   16 Aug 2015 10:22 AM GMT
బెజ‌వాడ‌కు రాజ‌ధాని క‌ళ‌క‌ళ‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా ఏపీ రాజ‌ధానికి త‌ర‌లివెళ్లే అంశంపై ప‌రిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ మ‌రో ఏడాదో.. రెండేళ్ల వ‌ర‌కో స‌మ‌యం ఉంటుంద‌ని వేసుకున్న అంచ‌నాల‌కు భిన్నంగా.. నెల రోజులు లేదంటే రెండు నెల‌లు గ‌డువు లోపే ఏపీ తాత్క‌లిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌కు ఏపీ యంత్రాంగం మొత్తం త‌ర‌లివెళ్లాల‌న్న అంశంపై సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

దీనికి తోడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..జిల్లా ప‌ర్య‌ట‌న‌లు మిన‌హాయిస్తే.. విజ‌య‌వాడ‌లోనే ఉండి కార్య‌క్ర‌మాల్ని ప‌ర్య‌వేక్షిస్తూ.. పారిశ్రామిక‌వేత్త‌లు.. విదేశీ అతిధుల‌ను సైతం బెజ‌వాడ‌లోనే క‌లుసుకుంటున్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌కు రాజ‌ధాని లుక్ వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు.

గ‌తంతో పోలిస్తే.. బెజ‌వాడ‌లో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిన‌ట్లుగా చెబుత‌న్నారు. అద్దెల‌తోపాటు.. హోట‌ళ్లు సైతం కిక్కిరిసిపోతున్నాయ‌ని.. ఓ మోస్తరు హోట‌ళ్లు కూడా ఖాళీ ఉండ‌టం లేద‌ని చెబుతున్నారు.

త‌ర‌లింపు ఖాయ‌మైన నేప‌థ్యంలో అద్దె ఇళ్ల కోసం వెతుకులాట పెరిగిపోయింది. ఇక‌.. కార్యాల‌యాల కోసం ఫంక్ష‌న్ హాళ్ల‌ను కూడా చూస్తున్న ప‌రిస్థితి. మొత్తంగా.. విజ‌య‌వాడ‌కు రాజ‌ధాని క‌ళ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అత్యంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి.. విజ‌య‌వాడ‌లో సామాన్యులు.. దిగువ‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు బ‌త‌క‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌ట‌మే. ఈ అంశాన్ని ఏపీ స‌ర్కారు కానీ దృష్టి సారించ‌క‌పోతే.. నేరాల రేటు తీవ్ర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.