Begin typing your search above and press return to search.
రెడ్డి కి రెడ్డి తోనే చెక్ పెట్టేలా బాబు వ్యూహం
By: Tupaki Desk | 28 Oct 2021 4:49 AM GMTఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో వైసీపీ చేతి లో చిత్తు గా ఓడిన తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదల తో ఉంది. ఆ దిశ గా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. విజయానికి కావాల్సిన వ్యూహాల ను సిద్ధం చేస్తున్నారు. పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టి నియోజకవర్గాల వారీ గా ఎలాంటి ప్రణాళికల ను అనుసరించాలని కసరత్తులు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కానీ టీడీపీ మరోసారి ఓడిపోతే ఇక ఆ పార్టీ భవిష్యత్ ప్రమాదం లో పడుతుంది. అందు కే బాబు ఈ సారి ఎలాగైనా గెలవాలని ఈ వయసు లోనూ కష్టపడుతున్నారు.
రాష్ట్రం లోని నియోజకవర్గాల వారీ గా పరిస్థితులను సమీక్షిస్తూ అక్కడి బలా బలాల పై ఓ అంచనా కు వస్తున్న బాబు దృష్టి ఇప్పుడు చంద్ర గిరి నియోజకవర్గం పై పడింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల తో బాబు ఉన్నట్లు కనిపిస్తోంది. తన సొంత జిల్లా లోని చంద్ర గిరి లో వైసీపీ తరపున చెవిరెడ్డి వరుసగా రెండు సార్లు విజయాలు సాధించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2014 లో టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గల్లా అరుణ ను ఓడించిన చెవిరెడ్డి అందరి దృష్టి నీ ఆకర్షించారు. ఆ తర్వాత 2019 లో టీడీపీ అభ్యర్థి పులపర్తి వెంకట మణిప్రసాద్ పై భారీ మెజార్టీ తో గెలిచారు. గత ఎన్నిక ల్లో ఏకం గా ఆయన 41,755 ఓట్ల తేడా తో నెగ్గారు.
ఈ నేపథ్యం లో 2024 ఎన్నికల ను ప్రతిష్టాత్మకం గా భావిస్తున్న బాబు.. అందు లో భాగం గా చంద్రగిరి లో చెవిరెడ్డిని ఓడించే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చెవిరెడ్డి పై తమ పార్టీ తరపున కూడా రెడ్డి సామాజిక వర్గాని కి చెందిన అభ్యర్థినే నిలబెట్టి ప్రత్యర్థికి చెక్ పెట్టేందుకు బాబు ప్రయత్నాలు మొదలెట్టారనే వార్తలు వస్తున్నాయి. తిరుపతి రూరల్ లో రెడ్డి సామాజిక వర్గం లో బలమైన పట్టున్న దివంగత మాజీ ఎమ్మెల్యే తనయుడిని ఈ సారి చంద్ర గిరిలో బరి లో దింపాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గం తో పాటు రెడ్ల ఓట్లు కూడా కలిసొస్తే అక్కడ పార్టీ విజయం ఖాయమనే అభిప్రాయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల నాటికి బాబుకు ఈ వ్యూహం కలిసొస్తుందో లేదో చూడాలి.