Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పై బాబు స్కెచ్ బాగుంది
By: Tupaki Desk | 11 Nov 2015 7:43 AM GMTఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులంతా విజయవాడకు తరలేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు సహా కొద్ది నెలల్లోనే కొత్త రాజధానికి వెళ్లిపోనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ పరిస్థితి ఏమిటి? ఇక్కడ పదేళ్ల పాటు ఎవరుండి ఈ భవనాల నిర్వహణ చూస్తారు? అనే సందేహాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆసక్తికరమైన పరిష్కారం సూచించారు.
విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన సచివాలయ అయిదు బ్లాకుల్లో వందలాది గదులు, విలాసవంతమైన పేషీలు ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వాటిని పదేళ్ల వరకు వినియోగించుకోవచ్చు. వీటి నిర్వహణ కోసమైనా అటెండర్ స్థాయి నుంచి ఉప కార్యదర్శి వరకు కొందరిని ఇక్కడే ఉంచే అవకాశాలున్నాయని సమాచారం. పదవీ విరమణకు దగ్గరలో ఉండి, హైదరాబాద్ లోనే ఉండాలని కోరుకునే వారినే ఇక్కడ కొనసాగించాలనుకుంటున్నారు. ఇక్కడెవరూ లేకుండా అంతా కొత్త రాజధానికి వెళ్లిపోతే, రాష్ట్రాల మధ్య నేటికీ ఉన్న సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు తలెత్తగలవని, ఆయా అంశాలపై పట్టు కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఒక సీనియర్ అధికారిని హైదరాబాద్ లోనే ఉంచి, ఆయన కింద ఒక విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
తమ హక్కుల కోసమైనా పదేళ్లూ సచివాలయాన్ని ఇక్కడ తమ ఆధీనంలోనే ఉంచుకోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ అంశాన్ని పలు సమావేశాల్లో చంద్రబాబు స్పష్టం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ నుంచి ఒక ఉప కార్యదర్శి స్థాయి అధికారిని హైదరాబాద్ లోనే కొనసాగించాలని భావిస్తున్నారు. సచివాలయ భవనాల నిర్వహణ, రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపైనా జరిగే చర్చలకు కొంతమంది ఇక్కడ అవసరమవుతారని, అందుకు ముఖ్య కార్యదర్శి హోదా గల ఒక అధికారి కూడా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉండగా...సచివాలయ భవనాల నిర్వహణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై త్వరలోనే విస్తృతంగా చర్చించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోవైపు సచివాలయంలో ఏపీ ఆధీనంలో ఉన్న చరాస్తులను విజయవాడ తరలించాలని నిర్ణయించారు.