Begin typing your search above and press return to search.
ఉద్యోగులు... చంద్రబాబు... ప్రత్యేక దోస్తీ
By: Tupaki Desk | 12 July 2015 2:32 AM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉద్యోగుల మధ్య విడదీయలేని బంధం ఉన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉద్యోగులను కావాలనే ఇబ్బందిపెట్టారనే వాదనలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా వ్యవహరించి ఉద్యోగులు ఓడించారనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా ఇసుక మాఫియాను అరికట్టడం, గోదావరి పుష్కరాల నిర్వహణలో ఇదే రీతిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పుష్కర పనుల్లో జరుగుతున్న జాప్యంపై సీరియస్‌గా ఉన్న చంద్రబాబు నాయుడు రాజమండ్రికి వెళ్లి సీఎం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో పుష్కరాల సుందరీకరణ పనులను, నమూనా దేవాలయాలను, పుష్కరనగర్ లను పరిశీలించారు. పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలైన నేపధ్యంలో పనుల పురోగతిలో అధికారుల తీరు చూసి బాబు నివ్వెరపోయారు. ఇంకా డ్రైయిన్ల నిర్మాణాలను అనుకున్న మేర పూర్తి చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సెంట్రల్ జైల్ ఎదురుగా సుందరీకరణ పనులను, నమూనా దేవాలయాలను, అభివృద్ధి చేసిన రోడ్లను, కోటిలింగాల ఘాట్ ను చంద్రబాబు పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమగ్రంగా విచారించారు. పుష్కర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానివ్వద్దని, పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికి జరిగిన ఆలస్యానికి ఉద్యోగులే కారణమని పేర్కొంటూ ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ అధికారులను ఆదేశించారు. పుష్కర పనుల్లో జరుగుతున్న అలసత్వంపై సీఎం ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్యోగులు ఒకింత కలవరపడ్డారు.