Begin typing your search above and press return to search.

లోకేశ్ స్పీడ్ మీద బాబు అసంతృప్తి

By:  Tupaki Desk   |   29 Sep 2016 9:21 AM GMT
లోకేశ్ స్పీడ్ మీద బాబు అసంతృప్తి
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించిన ఒక సంచలన అంశం ఒకటి బయటకు వచ్చింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం పేర్కొన్న వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కన్న కొడుకును అనేందుకు సైతం చంద్రబాబు మొహమాట పడరా? అన్నది చర్చగా మారింది. రాబోయే రోజుల్లో కాబోయే అధినేత బాబు చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ లోకేశ్ పై తన మనసులోని అసంతృప్తిని బాబు ఎక్కడ? ఎప్పుడు? ఎవరి ముందు ప్రదర్శించారు? ఇంతకీ ఆయనేమన్నారు? అన్న విషయాల్లోకి వెళితే..

ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం స్థానిక ఎన్నికల్ని ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై చర్చ జరగటం.. దీనిపై స్పందించిన పలువురు నేతలు సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా జనవరి 20 తర్వాత ఎన్నికల నిర్వహణకు సమయం అనుకూలంగా ఉంటుదన్న ఏకాభిప్రాయానికి వచ్చారు.

అనంతరం పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ సాగింది. గత ఏడాది యాభైరోజుల వ్యవధిలో 55 లక్షల సభ్యత్వ నమోదు జరిగిందని.. ఈసారి ఆ రికార్డును అధిగమించాల్న లక్ష్యం పెట్టుకున్నట్లుగా జరిగింది. పార్టీ యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లాలన్న బాబు.. పార్టీ నేతలు తమ వేగాన్ని పెంచుకోవాలన్న సూచన చేశారు. ఈ సందర్భంగా బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అన్నీ చంద్రబాబే చూసుకుంటారన్న భావనలో ఉన్నారని.. ఆ ఆలోచన కరెక్ట్ కాదన్న వ్యాఖ్య చేశారు. ‘‘లోకేశ్ లో కూడా స్పీడ్ తగ్గింది. గతంలో ఏదైనా చెబితే వెంటనే చేసేవాడు. ఇప్పుడా స్పీడ్ తగ్గింది. వేగం పెరగాలి. నేను నా కొడుకైనా లెక్క చేయను. పార్టీ విషక్ష్లో అందరూ స్పీడ్ గా ప్రజల్లోకి చొరవగా వెళ్లాల్సిందే. ప్రజల్లో 80 శాతం సంతృప్తి వచ్చే వరకు ఎవరినీ వదలను. అందరినీ పరిగెత్తిస్తూనే ఉంటా’’ అని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. బాబు తర్వాత అన్నీ చినబాబే అయిన లోకేశ్ తీరుపై కూడా సంతృప్తిగా ఉండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.