Begin typing your search above and press return to search.
బాబు మార్క్ ట్విస్ట్..వైసీపీకి మద్దతిచ్చేందుకు ఓకే
By: Tupaki Desk | 15 March 2018 12:07 PM GMTఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఊహించని రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కేంద్ర కేబినెట్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన లోక్ సభ సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లోక్ సభలో వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సీఎం చంద్రబాబునాయుడుతో ఆయన చాంబర్ లో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన ఛాంబర్ లో మంత్రులతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు - వైసీపీ అవిశ్వాసంపై చర్చించినట్లు సమాచారం. మంత్రుల సమావేశంలో వైకాపా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. వైకాపా అవిశ్వాసానికి మనం ఎందుకు మద్దతివ్వాలని పలువురు మంత్రులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెట్టి టీడీపీని దోషిగా చూపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పలువురు నేతలు సమావేశంలో చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వైసీపీకి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలని మంత్రులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి మైలేజీ దక్కిందని చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇటు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం - అటు వివిధ జాతీయ పార్టీల మద్దతు కోరడం ద్వారా వైసీపీ బలపడుతోందని చంద్రబాబు విశ్లేషించారు. అందుకే మద్దతు ఇవ్వడం తప్పనిసరి అని, లేని పక్షంలో టీడీపీ దోషిగా నిలబడుతుందని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత మాటకు వారు ఓకే చెప్పేశారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఆరోపణలకు దీటుగా స్పందించాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. గట్టిగా ఎదురుదాడి చేస్తేనే పవన్ జోరు తగ్గుతుందని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే సమావేశంలో రేపు సాయంత్రం ఐదు గంటలకు పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగితే వచ్చి పరిణామాలపై కూడా మంత్రులతో సమావేశంలో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. అయితే పొలిట్ బ్యూరో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నట్లుగా సమాచారం.