Begin typing your search above and press return to search.
మళ్లీ పాత బాబు వచ్చేశాడు
By: Tupaki Desk | 7 Sep 2015 5:47 PM GMTపదేళ్ల కిందట పాత చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చేశాడు. ఏడాదిన్నరగా ఉగ్గబట్టుకుని ఉద్యోగులతో సామరస్యంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు మరోసారి తన విశ్వరూపం చూపించారు. మూడు నెలల తర్వాత పాత చంద్రబాబును చూస్తారని స్వయంగా చెప్పుకున్న చంద్రబాబు ఆ మాట చెప్పిన పది రోజుల్లోనే తన విశ్వరూపంలో మొదటి భాగాన్ని చూపించారు.
పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులను ఒక ఆట ఆడుకున్నారు. నిజం చెప్పాలంటే ఆయన చేసిన పనులు కొన్ని మంచివి. కానీ, వాటిని చేసిన తీరు మాత్రం విమర్శలకు తావు ఇచ్చింది. పట్టణాల్లా పారిశుద్ధ్యం మెరుగు పరచాల్సిందే. ఆ బాధ్యత కమిషనర్ దే. ఆయనకు మనం జీతాలు ఇస్తున్నాం అందుకు ఆయనను తప్పు పట్టాల్సిందే. కానీ, గెజిటెడ్ అధికారులను, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అధికారులను నడిరోడ్డు మీద నిలబెట్టేసి చెడామడా తిట్టేస్తే వాళ్ల ఆత్మ గౌరవం కూడా మంటగలిసిపోతుంది. అంతకంటే ముందే, పారిశుద్ధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఒక డ్రైవ్ తీసుకురావాలి. అధికారులకు దానిగురించి పూర్తి స్థాయిలో వివరించాలి. వచ్చే నెల నుంచి నేను పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నానని కలెక్టర్లకు తేల్చి చెప్పాలి. ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసి అప్పుడు కూడా అధ్వానంగా ఉంటే కలెక్టర్ల ద్వారా సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలి. చెడామడా తిట్టడం కంటే చర్యలు తీసుకోవడం ఎక్కువ ఫలితాలను ఇస్తుందని ఉద్యోగ నేతలతోపాటు పలువురు విశ్లేషకులు విద్యావేత్తలు వివరిస్తున్నారు. ఉద్యోగులను నలుగురిలో తిట్టడం ద్వారా చంద్రబాబు చెడ్డ అవుతాడు. కానీ, పని చేయనందుకు అధికారులపై చర్యలు తీసుకుంటే, అది కూడా కలెక్టర్ల ద్వారా తీసుకునేలా చేస్తే ఉద్యోగి చెడ్డవాడు అవుతాడు. ఈ చిన్న విషయాన్ని అప్పట్లో చంద్రబాబు గుర్తించలేదని, దానితో ఉద్యోగులకు చెడ్డవాడు అయ్యాడని వివరిస్తున్నారు.
పదేళ్ల తర్వాత కూడా ఆయన అదే తీరుతో వ్యవహరిస్తున్నారని, మళ్లీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆయన తన చర్యలకు పదును పెట్టారని, ఇదే తీరుతో వ్యవహరిస్తే మరోసారి ఆయన ఉద్యోగులకు చెడ్డవాడు కావడం ఖాయమని వివరిస్తున్నారు.