Begin typing your search above and press return to search.

జేసీ అల్లుడు దీప‌క్ రెడ్డిని స‌స్పెండ్ చేసిన బాబు

By:  Tupaki Desk   |   15 Jun 2017 8:32 AM GMT
జేసీ అల్లుడు దీప‌క్ రెడ్డిని స‌స్పెండ్ చేసిన బాబు
X
పెరిగిన ఒత్తిడి.. అంత‌కంత‌కూ పెరుగుతున్న విమ‌ర్శలు.. మొత్తంగా ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. హైద‌రాబాద్ భూ అక్ర‌మాల కేసులో అరెస్ట్ అయిన ఏపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డిపై వేటు వేస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. భూముల స్కాంలో అరెస్ట్ కావ‌టంపై ఏపీ స‌ర్కారుపై విప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. ఆరోప‌ణ‌లతో అరెస్ట్ అయిన‌ దీప‌క్‌ ను బ‌హిష్క‌రించాలంటూ స‌ర్వ‌త్రా డిమాండ్లు వ‌స్తున్న నేప‌థ్యంలో బాబు నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌ని చెబుతున్నారు.

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అల్లుడైన దీప‌క్ రెడ్డిపై హైద‌రాబాద్ లో పెద్ద ఎత్తున భూముల్ని ఆక్ర‌మించుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆయ‌న్ను ఈ మ‌ధ్య‌నే అరెస్ట్ చేశారు. తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇంట్లో టీడీపీ స‌మ‌న్వ‌య భేటీ జ‌రిగింది. ఇందులో దీప‌క్ రెడ్డిపై వేటు వేయాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో గంటా శ్రీనివాస‌రావువివాదం పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.

విశాఖ‌లో మంత్రులు గంటా.. అయ్య‌న్న‌పాత్రుల మ‌ధ్య‌నున్న విభేదాల నేప‌థ్యంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌ద్ద‌ని.. నోరు విప్పొద్దంటూ బాబు హెచ్చ‌రించిన‌ట్లుగా స‌మాచారం. బ‌హిరంగ విమ‌ర్శ‌లు పార్టీకి ఇబ్బందిక‌రంగా మార‌తాయ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. విభేదాల‌ను ప‌రిష్కరించేందుకు త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని స‌మావేశంలో చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్య‌ర్థిని ఎంపిక చేసే అంశంపై కూడా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా చెబుతున్నారు. విశాఖ‌లో పార్టీ నేత‌ల మ‌ధ్య వివాదంపై బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి.. అలాంటి విష‌యాల్లో తాను క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌న్న విష‌యాన్ని స‌ద‌రు మంత్రుల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. తాజా వార్నింగ్ ఇద్ద‌రు మంత్రుల్ని ఎంత కంట్రోల్ చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/