Begin typing your search above and press return to search.

లాస్ట్ వర్డ్ : ఛలో విజయవాడ !

By:  Tupaki Desk   |   10 Aug 2015 3:33 PM GMT
లాస్ట్ వర్డ్ : ఛలో విజయవాడ !
X
ఒకవైపు ప్రజల సెంటిమెంటు.. మరోవైపు అధికారులు సణుగుడు...దీంతో చాలా కాలంగా విజయవాడ నుంచి పాలన అనేది కలగా మిగిలింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏం జరిగిందో ఏమో... చంద్రబాబు సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. వివరాలేమీ చెప్పకుండానే ఏపీ పాలన విజయవాడ నుంచి జరగాలని, ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారంలో ఆరు పని దినాలకు గాను నాలుగు పనిదినాలు ఏపీలోనే అందరూ ఉండాలని ఆర్డరు జారీచేశారు. ఇక కేబినెట్ మీటింగులు కూడా అక్కడే జరగనున్నాయి.

ఇదిలా ఉండగా అమరావతికి కార్యాలయాల తరలింపుపై సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావుకు జవహర్‌రెడ్డి కమిటీ ఒక నివేదిక సమర్పించింది. రెడీ టు వర్క్ ప్రాతిపదికన ఏడు లక్షల చదరపు అడుగుల భవనాలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. అయితే, ఇది అవసరమైన దానికంటే తక్కువ స్థలమే. ఎందుకంటే మొత్తం పాతిక వేల మంది సిబ్బంది ఉన్నారు. వారికి 25 లక్షల చదరపు అడుగుల పని ప్రదేశం అవసరం. కానీ ఈ నిమిషానికి ఏడు లక్షల అడుగులే సిద్ధంగా ఉంది. మరి ఇంకా కనీసం పది లక్షల అడుగుల స్థలమైనా కావాలి. దీనికోసం మరిన్ని భవనాలు పరిశీలించి తదుపరి నివేదిక సమర్పిస్తామని కమిటీ పేర్కొంది.