Begin typing your search above and press return to search.
2019 కలలు ఓకే..ఇప్పటి సంగతి చూడు బాబు
By: Tupaki Desk | 28 April 2018 5:27 PM GMTతనను తాను విజనరీగా ప్రకటించుకునే టీడీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు నవ్వుల పాలు అవుతోందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్ గురించి భారీ కలలు కంటున్న బాబు వర్తమానం మాత్రం పక్కనపెట్టేస్తున్నారని..ఇది పార్టీ పుట్టి ముంచడం ఖాయమంటున్నారు. ఢిల్లీ గురించి కలలు కంటున్న తమ చంద్రుడు గల్లీలో మసకబారుతున్న తెలుగుదేశం పార్టీ స్థితిని ఎందుకు గుర్తించడం లేదని వాపోతున్నారు. ఇదంతా పదే పదే చంద్రబాబు ప్రధాని పీఠంపై చేస్తున్న కామెంట్ల గురించి. ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’ జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2019లో భారత ప్రధాని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయే మరోమారు చెప్పుకొచ్చారు.
టీడీపీకి జాతీయ రాజకీయాలు కొత్త కాదన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానులను నిర్ణయించిన చరిత్ర తమకు ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మొత్తం పాతిక లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే ఈసారి కూడా ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని ప్రకటించేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేది బిక్ష కాదని, అది మన హక్కు అన్నారు. కాగా, కొద్దికాలం క్రితం కూడా చంద్రబాబు ఇదే మాటను చెప్పిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ``వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తా’’ అని ప్రకటించారు. అయితే 2019ఎన్నికల తర్వాత టీడీపీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని, ఆ విధంగా ఢిల్లీలో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే పార్టీ వర్గాలే బాబు డ్రీమ్స్‌పై ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. నాలుగేళ్లుగా బీజేపీని మెచ్చుకొని ఏపీకి ఎంతో చేస్తుందని వేనేళ్ల పొగిడి ఇప్పుడు అదే నోటితో తిడుతుండటంపై విమర్శలు గుప్పుమంటుంటే...పార్టీ పరువు పలుచన అవుతుంటే...ఢిల్లీ పీఠంపై ఎందుకంత క్రేజ్ అంటూ చర్చించుకుంటున్నారు.
మరోవైపు బాబు మాటలు నమ్మశక్యంగా లేవనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ కలుపుకొని 20 మంది ఎంపీలు ఉండగా సాధించలేనిది 25 మంది ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత ఎలా సాధిస్తారనే సందేహాన్ని పలువురు పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. కేవలం ఐదుగురు ఎంపీలను అధికంగా గెలిపించడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ సీట్ల మోజుతో ఏపీని నవ్వుల పాలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బాబు ఢిల్లీ డ్రీమ్స్ పక్కనపెట్టి పర్జలకు ఏం చేస్తున్నామో చెప్పడం మేలని అంటున్నారు.