Begin typing your search above and press return to search.
సిట్టింగులు వద్దే వద్దు...!
By: Tupaki Desk | 3 Oct 2018 5:29 AM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరిలో మార్పు వచ్చిందా....? ఆయన తన సన్నిహితులను కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారా..? తాను గతంలో చేసిన పనే ఇప్పుడు తన వారు కూడా చేస్తారని భయపడుతున్నారా...?అవుననే అంటున్నారు చంద్రబాబు నాయుడి అత్యంత సన్నిహితులు.దీనికి కారణం కూడా సహేతుకంగానే ఉందంటున్నారు. తన తర్వాత వారసుడిగా నారా లోకేష్ ను తీసుకురావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర‌్ణయాన్ని పార్టీలో సీనియర్లు అంగీకరించడం లేదు. వచ్చే ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు తన రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తన తర్వాత తన వారసుడిగా నారా లోకేష్ ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.దీంతో లోకేష్ ను వ్యతిరేకించే వారంతా ఒక్కటయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు పసిగట్టారంటున్నారు. దీనికి విరుగుడుగా వచ్చే శాసనసభ - లోక్ సభ ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ శాసనసభ్యులు - లోక్ సభ సభ్యులలో చాలా మందికి టిక్కట్లు ఇవ్వరాదని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారంటున్నారు. కొత్త వారికి టిక్కట్లు ఇవ్వడం వల్ల వారంతా లోకేష్ కు అనుకూలంగా ఉంటారని - పైగా సీనియర్ల అయితే వెన్నుపోటు రాజకీయాలకు తెర తీస్తారని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా వదులుకున్న స్ధానాల్లో కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. అలాగే సమస్యాత్మకంగా మారిన కొన్ని శాసనసభ - లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. విశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్నపాత్రుడు - గంటా శ్రీనివాసరావుల మధ‌్య విబేధాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. దీంతో వీరిద్దరిలో ఒకరిని విశాఖపట్నం లోక్ సభ బరిలో దింపే అవకాశాలున్నాయంటున్నారు. ఇక్కడి నుంచి గతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి హరిబాబు తెలుగుదేశం సాయంతో గెలిచారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని కీలక స్ధానాల్లో ఉన్న శాసనసభ్యులను మార్చే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా తనకు తలనొప్పిగా మారిన చింతమనేనిని - బొండా ఉమ వంటి వారిని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడిగా ఉన్న కింజారపు రాంమూర్తి నాయుడ్ని ఈసారి శాసనసభకు పోటీ చేయించి అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారంటున్నారు. దీనికి కారణం తన కుమారుడి వెనుక యువకులే ఉంటే ఇబ్బందులు ఉండవని - అదే సీనియర్లు అయితే గ్రూపులతో ఇబ్బందులు పెడతారన్నది చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.