Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఇంపాక్ట్‌..డేంజ‌ర‌ని బాబుకు అర్థ‌మైందా !

By:  Tupaki Desk   |   11 May 2018 8:14 AM GMT
కాంగ్రెస్ ఇంపాక్ట్‌..డేంజ‌ర‌ని బాబుకు అర్థ‌మైందా !
X
తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఒక తెలంగాణ నాయ‌కుడు అందులో త‌ప్పేముంది అని కూడా వ్యాఖ్యానించాడు. అయితే, మోడీతో విడిపోయాక అవ‌కాశం దొరికిన‌పుడ‌ల్లా మోడీపై, బీజేపీపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు కూడా దానికి ఒక అవకాశంగా వాడుకున్న చంద్ర‌బాబు బీజేపీని క‌ర్ణాట‌క‌లో ఓడించాల‌ని పిలుపునిచ్చారు. అయితే, తాజాగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు చంద్ర‌బాబు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై త‌నంత‌ట తానే స్పందించారు.

*నేను క‌ర్ణాట‌క‌లోని తెలుగు వారికి కాంగ్రెస్‌ కు ఓటేయ‌మ‌ని పిలుపు ఇవ్వ‌లేదు. కేవ‌లం బీజేపీని ఓడించ‌మ‌ని చెప్పాను* అని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు చంద్ర‌బాబు ఈ మాట ఎందుక‌న్నార‌బ్బా అని ప‌లువురు ప్ర‌శ్నార్థ‌క ముఖం పెట్టారు. అయితే, దీనికో కార‌ణం ఉంద‌ట‌. ఇటీవ‌ల కాంగ్రెస్‌తో క‌ల‌బోతున్న‌ట్లు వార్త‌లు రావ‌డం, కేసీఆర్ ఫ్రంట్‌ పై బాబు ఏ మాటా మాట్లాడ‌క‌పోవ‌డం, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకింగా ప్ర‌చారం చేయ‌డం చూస్తుంటే... చంద్ర‌బాబు నిజంగానే కాంగ్రెస్‌తో క‌లుస్తారేమో అని కొంద‌రు భావించ‌డం మొద‌లుపెట్టార‌ట‌. కాంగ్రెస్‌కు బ‌ద్ధ శ‌త్రువుగా పుట్టిన తెలుగుదేశం ఆ సెంటిమెంటుతోనే బాగా నిల‌బ‌డింది. పైగా ఏపీ ఈరోజు అనుభ‌విస్తున్న స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు కాంగ్రెస్ మూల‌క‌ర్త‌. మ‌రి అలాంటి కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడిన‌ట్టు జ‌నం ఫీల‌యితే త‌న‌కు ప్ర‌మాదం అని చంద్ర‌బాబు భావించార‌ట‌.

దీంతో జ‌నానికి కొంచెం క్లారిటీ ఇవ్వ‌డానికి నేను కాంగ్రెస్‌ కు ఓటేయ‌మ‌ని చెప్ప‌లేదు అని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కేవ‌లం బీజేపీని ఓడించ‌మని మ‌రోసారి పిలుపును ఇస్తున్నాను అని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ సెగ బాబుకు బానే త‌గ‌లింద‌న్న‌మాట‌.