Begin typing your search above and press return to search.
పీఎం కావాలని లేదు..చంద్రబాబు ముందు జాగ్రత్త?
By: Tupaki Desk | 8 May 2019 4:48 PM GMTతనకు ప్రధానమంత్రి పదవి అధిష్టించాలని లేదని ప్రకటించుకున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తను పీఎం పదవి రేసులో లేనట్టుగా ఆయనే ప్రకటించుకున్నారు. ఈ మాటను తెలుగు జనాలు రెండు రకాలుగా తీసుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్తగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని కొంతమంది, చంద్రబాబు నాయుడు పీఎం పదవిని ఆశించినా అది ఆయనకు దక్కే అవకాశాలు లేవని మరి కొంతమంది అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉండాలని బాబు తెగ ప్రయత్నిస్తూ ఉన్నారు.
అయితే ఈ మధ్య కొంతమంది 'చంద్రబాబు నాయుడు-పీఎం' అనే టాక్ మొదలుపెట్టారు. 'రాహుల్ కన్నా మాయ, మమత, చంద్రబాబులే పీఎం పదవికి అర్హులు' అంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అది కాంగ్రెస్ కు సహజంగానే అసంతృప్తికి గురి చేసి ఉండొచ్చు. అందకే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది తలెత్తకుండా తనకు పీఎం పదవి మీద ఆశ లేదని ప్రకటించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఎంపీ సీట్ల లాజిక్ ప్రకారం చూస్తే కూడా చంద్రబాబుకు పీఎం పదవి అందేది కాదు. వందకు పైగా ఎంపీ సీట్లను నెగ్గుతుందనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కే ఆ ఛాన్స్ దక్కుతుందా అనే సందేహాలున్నాయి. అలాగే రెండు వందలకు పైగా ఎంపీ సీట్లు వచ్చినా మోడీకి మళ్లీ ఆ ఛాన్స్ దక్కుతుందా అనే అనుమానాలూ ఉన్నాయి!
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పీఎం పదవి మీద ఆశలు పెట్టుకున్నా.. అవేవీ నెరవేరడం ఈజీ కాదు. అందులోనూ ఏపీలో చంద్రబాబు నాయుడు పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో ఇంకా తెలియదాయె. ఇలాంటి నేపథ్యంలో అనవసరం గా తన పేరు నాని రభస కానీయకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు ఇలా ముందే తనకు అలాంటి ఆశలు లేవని బాబు వివరణ ఇచ్చుకుంటున్నట్టుగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.