Begin typing your search above and press return to search.

మంత్రులకు చంద్రబాబు కొత్త టార్గెట్

By:  Tupaki Desk   |   23 Sep 2016 6:53 AM GMT
మంత్రులకు చంద్రబాబు కొత్త టార్గెట్
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రులకు కొత్త టార్గెట్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సూపర్ సక్సెస్ సాధించడానికి ఇప్పటి నుంచే రాజకీయ ఎత్తుగడలు వేయాలని టార్గెట్ ఇచ్చారు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముందు నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఈ మేరకు ఆయన సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. చేసిన పనులు - ప్రజల అభిమానం సాధించి ఓట్లను పొందడం కంటే రాజకీయ ఎత్తుగడలతోనే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేకపోవడంతోనే ఇలాంటి వ్యూహానికి పదును పెడుతున్నట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో రెండున్నరేళ్ళ పాలన తర్వాత వస్తున్న ఎన్నికలు కావడంతో దాన్ని రిఫరెండెంగా భావించే అవకాశముంది. ఈ రెండున్నరేళ్ళలో తాము చేసిన అభివృద్ధిని బట్టే ప్రజలు ఓట్లేస్తారు. కాబట్టి ఎన్నికలు కష్టమవుతాయి... సో... రాజకీయంగామిగతా పార్టీల నేతలను కొనుగోలు చేసి... వీలైతే ప్రజలను మభ్యపెట్టి, ఉత్తుత్తి హామీలు కుమ్మరించి మాయ చేయాలన్నది టార్గెట్ గా తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వంపై వస్తున్న విమర్శల విషయంలోనూ ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. స్విస్‌ ఛాలెంజ్‌ - ప్రత్యేక ప్యాకేజీ - విష జ్వరాలు - వరదలపైనే చర్చ జరిగింది. ప్రధానంగా స్విస్‌ ఛాలెంజ్‌ కు సంబంధించి న్యాయ స్థానాల్తో పాటు ప్రజలకు వివరించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విధానంలో ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించాలని కూడా సమావేశం నిర్ణయించింది. సాధారణ ప్రజల్లో కూడా స్విస్‌ ఛాలెంజ్‌ పై అవగాహన పెంచాలని నిర్ణయించింది. హోదాకంటే ప్యాకేజీ ద్వారానే రాష్ట్రానికి అధిక నిధులొస్తాయన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో మంత్రులు కూడా వైఫల్యం చెందారని చంద్రబాబు అన్నట్లు సమాచారం. మొత్తానికి ప్రజల్లో అనుమానాలు తొలగించి... అభిమానం పెంచడం ఇప్పుడు మంత్రుల భుజానిపై వేశారు చంద్రబాబు. వారు ఆ విషయంలో ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.