Begin typing your search above and press return to search.
మోడీని దారుణంగా అవమానించిన బాబు
By: Tupaki Desk | 14 Feb 2019 4:56 AM GMTవిమర్శలకు ఒక హద్దుటుంది.. రాజకీయంగా తిట్టండి భరిస్తారు.. లేదంటే ఖండిస్తారు. కానీ వ్యక్తులను, వ్యక్తిత్వాన్ని.. వారి చదువులను బట్టి అంచనావేయడం పెద్ద తప్పు. విద్యార్హతలను బట్టి వారిని కించపరిచేలా తిట్టడం సభ్యత , సంస్కారం కాదు.. మూడు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి.. ఆ తర్వాత ఏకచ్చత్రాధిపత్యంతో దేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడీపై చంద్రబాబు కించపరిచేలా వ్యక్తిగత దాడి చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
తాజాగా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నిర్వహించిన నిరసన సభలో ఏపీ సీఎం చంద్రబాబు సహా హేమాహేమీలు పాల్గొని ప్రసంగించారు. నరేంద్రమోడీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న చంద్రబాబు ఈ సభలో తీవ్రంగా నోరుజారారు. మోడీని ఉద్దేశించి అనరాని మాట అన్నాడు..
‘దేశంలో పెద్దపెద్ద చదువుకున్న వాళ్లు చాలా మంది దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు. కానీ మన దేశాన్ని పాలించే వ్యక్తి ఏం చదివారో తెలియదు.. ఎక్కడ చదివారో తెలియదు. , తాను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పట్టభద్రుడనని.. ఢిల్లీ సీఎం కూడా పోస్ట్ గ్రాడ్యూయేట్ అని.. నేను ప్రధానిని అడుగుతున్నానని.. మోడీ ఎక్కడ చదవాడో.. ఏం చదివాడో చెప్పాలి.. కానీ ఆయన సమాధానం చెప్పరు..’ అంటూ మోడీ విద్యార్హతలనుద్దేశించి కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారు.
ఇప్పుడీ మాటలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. చదువుకు, రాజకీయానికి ముడిపెట్టి వ్యక్తిగత దాడి చేసిన చంద్రబాబు వైఖరిపై కమళనాథులు గుస్సాగా ఉన్నారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తారా అని మండిపడుతున్నారు. చదువు రాని వాళ్లు కూడా రాజకీయాలను ఏలుతారని.. చదువుకు, ప్రతిభకు ముడిపెట్టి బాబు అనడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మోడీ చదువురాని వాడు అని బాబు అనడం ఇప్పుడు దేశరాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారడంతో ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి..