Begin typing your search above and press return to search.
ఎన్డీఏకు రాంరాం..వైసీపీ కోసమేనా బాబు?
By: Tupaki Desk | 16 March 2018 5:23 AM GMTకొద్దికాలంగా వస్తున్న ఒత్తిళ్లు కారణం కావచ్చు - రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు కానీ...గత కొద్దిరోజులుగా నానుతున్న చర్చకు చెక్ పెట్టారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం పార్టీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా తమ పార్టీ మద్దతును ఉపసంహరిస్తున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ డిఎనుంచి వైదొలగుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు.
పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన క్షణం నుంచి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. అయినా కేంద్రం మాత్రం ఏరకంగానూ స్పందించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో మోడీ టీమ్ కు గుడ్ బై చెప్పాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. అంతేకాదు, ఇవాళ కేంద్ర సర్కార్ పై అవిశ్వాసం తీర్మానం కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానం ఎవరు ప్రవేశపెట్టినా మద్దతు ఇస్తామని గురువారమే చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇవాళ ఉదయం అకస్మాత్తుగా తన మాట నుంచి యూటర్న్ తీసుకున్నారు. మోడీ సర్కార్ పై లోక్ సభలో తామే అవిశ్వాసం పెట్టనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో పడేశాయి. అయితే వైసీపీకి మైలేజీ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
లోక్ సభలో వైకాపా కేంద్ర ప్రభుత్వంపై నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుందనే సంగతి తెలిసిందే. తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా అన్ని ప్రాంతీయ - జాతీయ పార్టీలకు లేఖలు రాసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా కోరుతూ తెలుగుదేశం పార్టీకి కూడా వైకాపా లేఖ రాసింది. అవిశ్వాసానికి టీడీపీతో పాటు టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - టీఎంసీ - బీజేడీ - సీపీఎం - ఆప్ ల మద్దతును వైకాపా కోరింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు నిన్న నోటీసు ఇచ్చారు. వైసీపీ తరుపున గెలిచిన ఎంపీలకు ఆయన విప్ జారీ చేశారు. వైకాపా ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతునిస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే వైసీపీకి మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన ఎన్డీఏకు గుడ్ బై చెప్పడంతో పాటు అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు అంచనా వేస్తున్నారు.