Begin typing your search above and press return to search.

నీతీశ్ ను తోపుగా చెప్పేటోళ్లు.. బాబును ఇకపై ఆ మాటలు అనలేరు

By:  Tupaki Desk   |   11 Aug 2022 4:19 AM GMT
నీతీశ్ ను తోపుగా చెప్పేటోళ్లు.. బాబును ఇకపై ఆ మాటలు అనలేరు
X
గొప్ప పనులు చేసి కూడా దానికి సంబంధించిన క్రెడిట్ పొందలేని వారు కొందరు ఉంటారు. అలాంటి వారి కోవలోకే వస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ ను వేలెత్తి చూపించి.. వెటకారం చేసే వారంతా కూడా ఆయన నాటిన మొక్కలకు కాచే పండ్లను తింటున్న వారే అన్నది మర్చిపోకూడదు.

చంద్రబాబు గొప్పతనం ఏముంది? అని విమర్శించే వారు.. ఒక వాదనను తరచూ వినిపిస్తూ ఉంటారు. చంద్రబాబుకు సొంతంగా బలం లేదని.. ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడి అధికారంలోకి వస్తారే తప్పించి.. సొంతంగా వచ్చింది లేదంటారు.

ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ నేతల నోటి నుంచి తరచూ వింటుంటాం. అందులో నిజం ఎంతన్నది చూసినప్పుడు.. ఆ మాటలన్ని నిజాలుగానే అనిపిస్తాయి. కానీ.. కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. కొందరిని తోపులుగా అభివర్ణించే వేళ.. ఆ మాటకు వస్తే చంద్రబాబు చాలా గ్రేట్ కదా? అన్న భావన కలుగుతుంది. బిహార్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. అందరూ నీతీశ్ తోపు.. తురుంఖాన్.. మోడీషాలను దెబ్బేసిన మొనగాడు లాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారే.

ఈ మాటలన్ని కూడా మోడీషాల మీద ఉన్న వ్యతిరేకతతో చేస్తున్న వ్యాఖ్యలే తప్పించి.. మరెలాంటి ప్రత్యేకత లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే.. 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బిహార్ లో నీతీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం కేవలం 43 సీట్లు మాత్రమే. అంటే.. మొత్తం సీట్లలో ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు 20 శాతం కంటే తక్కువన్నది మర్చిపోకూడదు. అయినప్పటికీ అధికారంలోకి రాగలిగారంటే కారణం.. అక్కడున్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం.

అంటే.. సొంత బలం లేకున్నా అధికారంలోకి రావటం.. ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఆయనకేచెల్లుతుంది. ఈ లెక్కన చూస్తే.. నితీశ్ కంటే కూడా చంద్రబాబు చాలా బలమైన నేతగా చెప్పాలి. అధికారంలో ఉండటమే తెలివికి.. సమర్థతకు.. గొప్పతనానికి నిదర్శనమైతే.. నీతీశ్ కంటే చంద్రబాబు మహా తోపు గా చెప్పక తప్పదు.

2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ.. జనసేనతో పొత్తు పెట్టుకోవటంపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని ప్రదర్శించటం.. ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా? అలాంటిమాటలన్ని కూడా.. సదరు కాంబినేషన్ తో తమకున్న అధికారం ఎక్కడ చేజారిపోతుందన్నదే తప్పించి మరింకేమీ కాదన్న నిజాన్ని మర్చిపోకూడదు. అందుకే.. చంద్రబాబును ఊరికే మాటలు అనే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.