Begin typing your search above and press return to search.

బాబు టెక్నాలజీ తోపు అని తేలిపోయింది

By:  Tupaki Desk   |   26 Aug 2016 7:27 AM GMT
బాబు టెక్నాలజీ తోపు అని తేలిపోయింది
X
హైటెక్ ముఖ్యమంత్రి అన్న మాట విన్న వెంటనే గుర్తుకు వచ్చేది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే. నిజంగానే టెక్నాలజీని ఏ స్థాయిలో వినియోగిస్తున్నారన్నది తాజాగా అందరికి అర్థమయ్యేలా చేసింది. ఒక ప్రైవేటు ఛానల్ తో చంద్రబాబు హైటెక్కు గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పాలిస్తున్నారు? రాష్ట్రంలో జరిగే ప్రతి అంశం మీదా సమాచారం ఆయన ఫింగర్ టిప్స్ మీద ఎలా ఉంటుంది? లాంటి అంశాలతో పాటు.. ప్రతి విషయంలోనూ ఆయన సమాచారాన్ని సేకరించటంతో పాటు.. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకునేలా డ్యాష్ బోర్డును వినియోగిస్తున్న తీరును చంద్రబాబు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంతెంత వర్షం పడింది? అక్కడి భూగర్భ జలాల పరిస్థితి ఏంటి? లాంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమచారం బాబు దగ్గర ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆయనే స్వయంగా చూపించటం గమనార్హం. టెక్నాలజీ సాయంతో అవినీతికి చెక్ పెట్టినట్లుగా చెబుతున్న చంద్రబాబు మాటల్లో నిజం ఎంతన్న విషయం తేల్చే ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది.

విజయవాడకు చెందిన వేముల వీరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక ఫిర్యాదు చేశారు. తన వేలిముద్రలుసరిగా పడలేదంటూ పింఛను ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెడుతున్నారన్నది ఆయన కంప్లైంట్. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన దగ్గరున్న డ్యాష్ బోర్డ్ సాయంతో నిమిషాల్లో ఆయనకు ఈ నెల పింఛను మూడో తేదీన సాయంత్రం 5.51 గంటలకు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

తనకు పింఛను ఇచ్చింది నిజమేనని చెప్పటం.. ఉదయమా? సాయంత్రమా? అన్న ప్రశ్న వేసినప్పుడు సదరు వ్యక్తి సాయంత్రం అని చెప్పటంతో డ్యాష్ బోర్డు పని తీరు ఎంత పక్కాగా ఉందన్న విషయం స్పష్టమైన పరిస్థితి. పేరుకే హైటెక్కు కాకుండా..రియల్ గానే ఎంత హైటెక్కు బాబు అన్న విషయాన్ని సదరు ఛానల్ సాక్షిగా జనాలకు అర్థమయ్యేలా చేయటంలో బాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని చూసినోళ్లకు అర్థమయ్యేది ఒక్కటే.. టెక్నాలజీని వినియోగించుకోవటంలో బాబు తోపు అని.