Begin typing your search above and press return to search.
రేవంత్ కు బ్రేకులేయకుంటే బాబుకు బ్యాండే!
By: Tupaki Desk | 11 Sep 2015 6:22 AM GMTహైకోర్టు వారు తనకు పూర్తి స్థాయి సడలింపులు కల్పించిన తర్వాత రాజధాని నగరంలోకి సుదీర్ఘ విరామం తర్వాత ప్రవేశించిన సందర్భంలో.. రేవంత్ రెడ్డి 'సింహం వస్తున్నదని తెలిసి కేసీఆర్ చైనా పారిపోయిండు' అన్నా.. 'ఆటకాదు.. వేటమొదలైంది' అన్నా.. ఆ మాటలు విని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బహుశా చాల మురిసిపోయి ఉండవచ్చు. హమ్మయ్య తమ పార్టీ నుంచి ఇక కేసీఆర్ ను, ఆయన సర్కారును ఎడాపెడా ఆడుకోవడానికి ఒకడు వచ్చాడు లెమ్మని ఊపిరి పీల్చుకుని ఉండవచ్చు. కానీ.. రేవంత్ రెడ్డి స్పీడుకు బ్రేకులు వేయకుండా.. చంద్రబాబు ముందు ముందు పశ్చాత్తా పడవలసిన పరిస్థితి తప్పకపోవచ్చునని పార్టీలోని సీనియర్ లు అంచనా వేస్తున్నారు. ఇది పార్టీలో చాలా విపరిణామాలకు దారి తీస్తుందని కూడా అంటున్నారు.
రేవంత్ రెడ్డిని ప్రస్తుతం ఆయన చెలరేగుతున్న తీరులోనే యథ్ఛేగా, విశృంఖలంగా పోవడానికి పార్టీ అధినేత అనుమతిస్తే గనుక.. చంద్రబాబునాయుడు ముందు ముందు పలువురు సీనియర్లను కోల్పోవాల్సి వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేది దిక్కూ మొక్కూ లేని వ్యవహారంలాగా ఉన్నది. పార్టీలో సీనియర్ లు, దృఢంగా వ్యవహరించగల వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలా మంది పార్టీ మారిపోగా, ఉన్న కొందరు.. ఏదో పార్టీ మనుగడను నడిపిస్తున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత.. ఆయన జైలులో ఉన్నా, బెయిలు తర్వాత కొడంగల్ కు పరిమితం అయినా.. ఆయన లేని లోటు తెలియని విధంగానే.. తెలంగాణ తెదేపా నాయకులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పోరాడుతూనే వచ్చారు. తెరాస సర్కారు నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయనిపించిన ప్రతి సందర్భంలోనూ తెదేపా తరఫున.. బాగానే పోరాడారు. అయితే ఇప్పుడు రేవంత్ రాగానే.. విధానాల మీద కాకుండా వ్యక్తిగతంగా కక్షగా తీసుకున్నట్లునగా పరిస్థితులు రంగు పులుముకుంటున్నాయి. తెదేపా పార్టీకోసం పోరాడుతున్నట్లుగా కాకుండా.. తనను అరెస్టు చేయించారు గనుక.. అంతు తేలుస్తా అన్నట్లుగా వైఖరి మారుతున్నదని పలువురు అంటున్నారు. అందువల్ల రేవంత్ దూకుడుకు చంద్రబాబు బ్రేకులు వేయకుంటే గనుక.. ఆయన పార్టీలోని సీనియర్ లు ఎర్రబెల్లి, రమణ వంటి వారిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి తప్పకవపోచ్చుననేది పలువురి అంచనా. వీరిలో ఎర్రబెల్లి తో రేవంత్ కు కోల్డ్ వార్ చాలాకాలంనుంచే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని.. పరిస్థితుల్ని తిరిగి గాడిలో పెడతారో చూడాలి.