Begin typing your search above and press return to search.

తెరపైకి కొత్తపేర్లు..మారుతున్న టీడీపీ రాజకీయం

By:  Tupaki Desk   |   7 March 2019 11:36 AM GMT
తెరపైకి కొత్తపేర్లు..మారుతున్న టీడీపీ రాజకీయం
X
టీడీపీ జోరు పెంచింది. వరుసగా లోక్ సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నారు. తాజాగా అమలాపురం లోక్ సభ పరిధిలోని టీడీపీ అభ్యర్థులకు సీట్లను ఖరారు చేశారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాల్లో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. మరో నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. అమలాపురం - గన్నవరం రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. కొత్త పేట అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేరు ప్రకటిస్తారని సమాచారం.

ఇక రామచంద్రరావు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు - మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు - ముమ్మిడివరం నుంచి దాట్ల బుచ్చిబాబు - కొత్త పేట నుంచి బండారు సత్యానందారావుల పేర్లు ఖరారైనట్టు సమాచారం. రాజోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యారావునే ఖరారు చేశారని సమాచారం. సూర్యారావును ఎంపీగా పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ ఆయన ఆసక్తి చూపలేదని తెలిసింది.

ఇక మాజీ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ ఎంపీ అభ్యర్థిగా పంపాలని బాబు యోచిస్తున్నట్టు సమాచారం. అయితే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్కా బాలయోగితో పాటు మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కుమార్తెతో పాటు మరో ఇద్దరు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరిని ఎంపీ స్థానానికి టీడీపీ అధిష్టానం ఎంపిక చేస్తుందని బాలయోగి తనయుడే రేసులో ముందున్నారని సమాచారం.

అయితే అమలాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనందరావును పక్కనే ఉన్న గన్నవరం నుంచి పోటీచేయించాల్సిందిగా బాబుకు సూచించారట.. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణమూర్తిని ఈసారి తప్పించే అవకాశాలున్నాయని సమాచారం. సర్వేల ఆధారంగా ఈ మార్పును బాబు చేస్తున్నట్టు సమాచారం. అమలాపురం - గన్నవరం టికెట్ కోసం ఇప్పటికే కారెం శివాజీ - నేలపూడి స్టాలిన్ - నీతిపూడి స్వర్ణలత - ఉండ్రు శేషారత్నంల పేర్లు చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు మినహా అన్నింటిని చంద్రబాబు ఓకేచేశారని తెలుస్తోంది.