Begin typing your search above and press return to search.
ఆఫీసుపై హెలిప్యాడ్ ఉన్న ఓన్లీ సీఎం చంద్రబాబు
By: Tupaki Desk | 20 Feb 2016 6:54 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నానాబాధలు పడుతుంటే సీఎం చంద్రబాబు సోకులు పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన గట్టెక్కించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం ఖజానాపై భారం మోపుతున్నారన్న అపవాదు ఎదుర్కొంటున్నారు. కొత్త రాజధాని అమరావతిలోని వెలగపూడి గ్రామంలో నిర్మించబోయే ఏపీ సెక్రటేరియట్ పైభాగంలో ముఖ్యమంత్రి నేరుగా దిగేలా హెలిప్యాడ్ నిర్మించబోతున్నారు. అయితే... విమర్శల మాట ఎలా ఉన్నా ఈ హెలిప్యాడ్ తో చంద్రబాబు మాత్రం సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. ఇండియాలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తాను పనిచేసే భవనం(సెక్రటేరియట్) పైన నేరుగా దిగేలా హెలిప్యాడ్ లేదు. దీంతో రూఫ్ టాప్ హెలిప్యాడ్ ఉన్న తొలి సీఎం చంద్రబాబే కానున్నారు.
దేశంలో అతికొద్ది మంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇలాంటి రూఫ్ టాప్ హెలిప్యాడ్ లు ఉన్నాయి. కొందరికి తమ కార్యాలయాలపై ఉండగా... ఇంకొందరు ఇళ్లపై నిర్మించుకున్నారు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం అధికారిక హోదాలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సెక్రటేరియట్ పై నిర్మిస్తున్నారు. కొత్త రాజధాని అమరావతికి సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి వెలగపూడిలోని సెక్రటేరియట్ కు 50 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో వస్తే ముఖ్యమంత్రికి, ప్రజలకు కూడా ఇబ్బందే. కాబట్టే చంద్రబాబు ఇలా ప్లాన్ చేశారని చెబుతున్నారు. మొత్తం ఆరు భవనాలుగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో చంద్రబాబు కార్యాలయం ఉండే భవనం పైకప్పుపై 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. హెలిప్యాడ్ సమీపంలోనే లిఫ్టు ఏర్పాటు చేసి దానిద్వారా చంద్రబాబు తన కార్యాలయంలోకి చేరుకునేలా ఏర్పాటు ఉంటుంది.
కాగా దీనిపై అధికార వర్గాల్లోనూ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కష్టాల్లో ఉందని చెప్పి తమకు ఖర్చులు తగ్గించుకోమంటున్న సీఎం మాత్రం విలాసాలకు పోతున్నారని అంటున్నారు.