Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రులకు ఇక స్టార్ రేటింగ్
By: Tupaki Desk | 20 April 2017 7:33 AM GMTఏపీ మంత్రులు - మంత్రిత్వ శాఖలకు ఇక వస్తువులు - సేవల మాదిరిగా రేటింగ్ ఇవ్వనున్నారట. సీఎం చంద్రబాబు ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కులు - ర్యాంకింగులతో మంత్రుల దుమ్ముదులుపుతున్న ఆయన ఇక నుంచి మంత్రులు - మంత్రిత్వ శాఖలు - ప్రభుత్వ విభాగాలకు వారు అందించే సేవలు - పనితీరు ఆధారంగా రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారట. ఈ రేటింగ్ నెలవారీ పనితీరు ప్రాతిపదికన ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల పలు శాఖలతో నిర్వహిస్తున్న సమీక్షల సందర్భంగా సీఎం ఈ విషయం చెబుతున్నారు. ప్రతి నెలా అన్ని శాఖల పనితీరుపై రేటింగ్స్ ఇస్తామని.. అందుకు సంబంధించి కసరత్తు ఇప్పటికే జరుగుతోందని చంద్రబాబు చెబుతున్నారు. సీఎం డ్యాష్ బోర్డు ఆధారంగా ఇది నిర్ణయిస్తారని తెలుస్తోంది.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కార వివరాలను గ్రీవెన్స్ డ్యాష్ బోర్డులో తెలుసుకోవచ్చు. సమస్య పరిష్కరించిన తీరు, అది ఫిర్యాదు చేసిన వారికి నచ్చిందీ లేనిదీ పౌరులు డ్యాష్ బోర్డులో తెలుస్తుంది. దీంతో డ్యాష్ బోర్డు ఆధారంగా అధికారుల పనితీరును గమనించేందుకూ ఉపయోగ పడుతుంది. దాని ఆధారంగా ఆయా అధికారులు, శాఖలు, మంత్రులకు రేటింగ్ ఉండనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/