Begin typing your search above and press return to search.
బాబు ఎన్నికల హామీలు!..అమలు మతలబు చూశారా?
By: Tupaki Desk | 16 Feb 2019 7:39 AM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి ఏదేనీ హామీ వచ్చిందంటే... దాని అమలుపై అంతగా ఆశలు పెట్టుకోవాల్సిన పనిలేదు. ఇదేదో విపక్షాలు చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. స్వయంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పాలి. గడచిన ఎన్నికల్లో అధికారమే పరమావధిగా లెక్కలేనన్ని హామీలు ఇచ్చిన చంద్రబాబు... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కాల్సిన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత ఎప్పటిలానే తనదైన సహజసిద్ధ వైఖరితో ముందుకు సాగిన చంద్రబాబు... ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అటకెక్కించేశారు. ఇందుకు లెక్కలేనన్ని నిదర్శనాలు ఇప్పుడు కళ్ల ముందర కనిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు... దాదాపుగా నాడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలైన దాఖలా లేదనే చెప్పాలి. అయితే నిన్నటిదాకా హామీలను అమలు చేయకున్నా పెద్ద ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఐదేళ్ల క్రితం నాడు ఎన్నికలు జరిగితే... మరో రెండు నెలల్లో మరోమారు ఎన్నికలు తరుముకొస్తున్నాయి.
మరి గడచిన ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టడం అంత ఈజీ కాదు కదా. మరేం చేయాలి? గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలి. అదే దిశగా ఆలోచించిన చంద్రబాబు... ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ ఎన్నికలకు కాస్తంత ముందుగా అమలు చేసి చూపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కాపుల రిజర్వేషన్లను నాన్చీ నాన్చి... మొన్న ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో నుంచి ఓ 5 శాతాన్ని విడగొట్టి కాపులకు ఇచ్చేస్తామని బాబు చెప్పారు. ఇది సాధ్యమో - అసాధ్యమో అన్న విషయాన్ని ఏమాత్రం చర్చకు రానీయకుండానే బాబు మంత్రాంగం నడిపారు. ఇక డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణ మాఫీపై మొన్నటిదాకా ఎన్నెన్నో కథలు చెప్పిన బాబు సర్కారు... సరిగ్గా ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరిట దానిని అలా నడిపించేశారు. ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ - బ్యాంకుల్లో వాటి ఎన్ క్యాష్ మెంట్ పై పెద్ద రభసే నడుస్తోంది. ఇక రైతు రుణ మాఫీ... ఏదో అలా మూడు విడతల సొమ్మును నాలుగేళ్లలో మమ అనిపించేసి.. మిగిలిన నాలుగు - ఐదు విడతల సొమ్మును సరిగ్గా ఈ ఎన్నికలకు కాస్తంత ముందుగా విడుదల చేసేందుకు బాబు నిర్ణయించారు.
ఇక రైతులకు 9 గంటల పాటు పగటిపూటే విద్యుత్ సరఫరా అంశం కూడా ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు తెర లేసింది. ఇప్పటిదాకా రైతులకు బాబు సర్కారు సరఫరా చేస్తున్న విద్యుత్ 7 గంటల పాటేనన్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న బాబు 9 గంటల విద్యుత్ పై ప్రకటన చేశారు. బాబు ప్రకటన చేసిన పది రోజులకు గానీ.. . ప్రభుత్వం జీవో విడుదల కాలేదు. నిన్న రాత్రి జీవో విడుదల చేసిన ప్రభుత్వం రైతులకు పగటిపూటే 9 గంటల పాటు విద్యుత్ ను అందిస్తామని చెప్పింది. అయితే ఇక్కడ కూడా బాబు సర్కారు ఓ మడత పేచీ పెట్టింది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నామన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే మరిచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ - వాటితో పాటు ఇంకా కొన్ని హామీలను అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు... గడచిన ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ ఎన్నికలకు కాస్తంత ముందుగా వాటిని అమలు చేస్తున్నామన్న విషయాన్ని ఏమాత్రం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.