Begin typing your search above and press return to search.
వాళ్లకు బాబు పర్సనల్ గా ఇన్విటేషన్ ఇస్తే..?
By: Tupaki Desk | 7 Oct 2015 9:50 AM GMTఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి అత్యంత కీలకమైన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ.. విదేశీ అతిధుల్ని వరుస పెట్టి పిలవటమే కాదు.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరిన్ని ఏర్పాట్లు చేస్తున్న చంద్రబాబు.. ఏపీలోని విపక్ష నేతల్ని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారా? అన్నది ప్రశ్న. ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమం కావటంతో జగన్ కు ఆహ్వానం ఉంటుంది. కానీ.. ఏదో పిలిచామంటే పిలిచామన్నట్లుగా కాకుండా.. ఏపీలోని విపక్ష పార్టీలకు నేతృత్వం వహిస్తున్న ముఖ్యనేతలందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇన్విటేషన్లు ఇచ్చే కొత్త సంప్రదాయం మొదలు పెట్టినట్లు అవ్వటంతో పాటు.. ఏపీ రాజధాని నిర్మాణంలో అందరిని పాలుపంచుకునేలా చేసినట్లు అవుతుందన్న భావన వ్యక్తమవుతుంది.
ఇవాల్టి రోజున ఉన్న దూకుడు రాజకీయాలతో ఇలాంటివి సాధ్యమా అన్న సందేహం కలుగుతున్నా.. బాబు ప్రయత్నించాలే కానీ.. ఇదో చక్కటి సంప్రదాయంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. గతంలో.. అధికార.. విపక్ష నేతలదిద్దరూ కులాసాగా అప్పుడప్పుడన్నా మాట్లాడుకునే వారు. రాజకీయాల మాట ఎలా ఉన్నా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు కలిసిమెలిసి ఉండటం బాగుండేది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ విధానం సాగినా.. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు.. వైఎస్ ల మధ్య సంబంధాలు క్షీణించి.. చివరకు ఒకరిని ఒకరు చూసుకోవటం కూడా మానేసే పరిస్థితి వరకూ వెళ్లారు.
రాజధాని శంకుస్థాన అన్నది చరిత్రలోనిలిచిపోయే కార్యక్రమం. అలాంటి అరుదైన కార్యక్రమానికి.. బాబు తన భేషజాల్ని పక్కన పెట్టేసి.. విశాల హృదయంతో పార్టీ అధినేతలందరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికితే.. చరిత్రలో ఈ ఘట్టం అలా నిలిచిపోతుంది. అంతేకాదు.. ఇప్పుడున్న రాజకీయాలతో పోలిస్తే.. భవిష్యత్తులో మరింత సంకుచితంగా మారటం ఖాయం. అలాంటి రోజుల్లో సైతం.. శంకుస్థాపన నాటి పిలుపుల సంగతి ఎప్పటికి నిలిచిపోవాలంటే.. బాబు కాస్తంత పెద్ద మనసుతో వ్యవహరించి.. విపక్ష పార్టీల అధినేతల్ని శంకుస్థాపనకు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే జరిగితే.. అదో అపురూప ఘటనగా చరిత్రలో మిగిలిపోవటం ఖాయం