Begin typing your search above and press return to search.
సింగపూర్ ప్రధానికి ‘అమరావతి’ ఇన్విటేషన్
By: Tupaki Desk | 22 Sep 2015 7:04 AM GMTదసరా రోజున ఏపీ కలల పంట అయిన ఏపీ రాజధాని నగరమైన అమరావతికి శంకుస్థాపన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి శంకుస్థాపన బాబు మార్క్ కనిపించటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికీ భారీ ప్లాన్ ఒకటి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా.. అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించటం తెలిసిందే.
దేశ ప్రధాని మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్.. జపాన్ మంత్రివర్గ బృందంతో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్రమంత్రులు.. వీవీఐపీలు భారీగా హాజరు కావటం ఖాయమని చెబుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ ప్రధాని లూంగ్ కు శంకుస్థాపన ఆహ్వాన పత్రికను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అందజేశారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మానంలో సింగపూర్ ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి.. థ్యాంక్స్ చెప్పినట్లుగా చెబుతున్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తాను తప్పనిసరిగా వస్తానని చంద్రబాబుకు సింగపూర్ ప్రధాని మాట ఇచ్చినట్లుగా చెబుతున్నారు. రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన ఇన్విటేషన్ పంపిణీ కార్యక్రమం సింగపూర్ ప్రధానికి ఇవ్వటంతో మొదలైనట్లుగా చెబుతున్నారు.