Begin typing your search above and press return to search.

నారావారి పల్లె మరీ అంత చిన్నదా?

By:  Tupaki Desk   |   8 Dec 2016 4:24 AM GMT
నారావారి పల్లె మరీ అంత చిన్నదా?
X
చిత్తూరు జిల్లా నారావారి పల్లె.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులందరితో సొంతూరుకు వెళ్లి గడుపుతూ ఉంటారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీని క్యాష్ లెస్ లావాదేవీల్లో ముందుండేలా చేయాలని తపిస్తున్న చంద్రబాబు.. మార్పు సొంతూరు నుంచే చేయాలని భావిస్తున్నారు.

క్యాష్ లెస్ లావాదేవీలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి చంద్రబాబు కన్వీనర్ గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. ఆయన స్వగ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చే ప్రయత్నాన్ని అధికారులు షురూ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. నారావారి పల్లెలోని 78 కుటుంబాలకు వివిధ అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గ్రామంలో మొత్తం 78 కుటుంబాలకు 73 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 25 మందికి రూపే కార్డులు ఉన్నాయని.. మిగిలిన వారు కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మొబైల్ తో నగదు రహిత లావాదేవీల్ని పూర్తిస్థాయిలో నారావారి పల్లె గ్రామస్తులు చేసేలా చేయటమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. ఇందులో భాగంగా రూపే కార్డుల్ని ఎలా వినియోగించుకోవాలి.. స్వైపింగ్ మెషిన్ల వాడకం ఎలా అన్న అంశంపై గ్రామాస్తులకు అవగాహన పెరిగేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి.. అధికారుల చర్యల్ని నారావారి పల్లె గ్రామస్తులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.