Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ తో డేటింగ్ డ్రామాకు బాబు పుల్ స్టాప్‌!

By:  Tupaki Desk   |   1 Nov 2018 4:47 AM GMT
కాంగ్రెస్‌ తో డేటింగ్ డ్రామాకు బాబు పుల్ స్టాప్‌!
X
గ‌డిచిన కొద్ది రోజులుగా ర‌హ‌స్యంగా సాగుతున్న డేటింగ్ కు తెర దించ‌నున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. కాంగ్రెస్ పార్టీతో ఆయ‌న తెర వెనుక పావులు క‌దుపుతూ.. పైకి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ అధ్య‌క్షుడితో భేటీ కాన‌ట్లుగా క‌ల‌ర్ ఇచ్చిన వైనం తెలిసిందే. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీతో చెట్టాప‌ట్టాలు వేసుకున్న‌ప్ప‌టికీ.. పైకి మాత్రం అదంతా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణ‌యంగా.. అక్క‌డి నేత‌లంతా క‌లిసి మూకుమ్మ‌డి నిర్ణ‌యం అన్న‌ట్లుగా చేయ‌టం తెలిసిందే. పొత్తుల చ‌ర్చ‌ల వెనుక హైడ్రామా న‌డిపిన బాబు.. బ‌య‌ట‌కు మాత్రం అదేమీ కాకుండా త‌మ పార్టీ నేత‌లే క‌లిసి నిర్ణ‌యం తీసుకున్న భావ‌న‌కు క‌లుగ జేశారు.

అమ‌రావ‌తి టు టెన్ జ‌న్ ప‌థ్‌ కు హాట్ లైన్ కార్య‌క‌లాపాలు మొద‌లై చాలా కాల‌మే అయింది. కాంగ్రెస్ మీద క‌సితో ఏర్పాటు చేసిన పార్టీగా టీడీపీకి ఉన్న ముద్ర‌ను మార్చే ప్ర‌య‌త్నంపై ఎలాంటి స్పంద‌న ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించేందుకు వీలుగా.. కొద్ది రోజులుగా కాంగ్రెస్ తో క‌లిసి వెళ్లే వైనంపై ఇప్ప‌టికే ప‌లుమార్లు సంకేతాలు ఇవ్వ‌టం తెలిసిందే.

తాజాగా మంత్రుల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు.. త‌న ఢిల్లీ టూర్ లో జాతీయ పార్టీల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నేత‌ల‌తో భేటీ కానున్నారు. ఆ నేత‌ల్లో ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఒక‌రు. పార్టీల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ప‌వార్‌.. బాబుతో భేటీ సంద‌ర్భంగా విందును ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందుకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లువ‌నున్నారు.

దీంతో.. టీడీపీ.. కాంగ్రెస్ ల మ‌ధ్య న‌డిచిన 20 ఏళ్ల రాజ‌కీయ శ‌త్రుత్వం స‌మాధి కావ‌ట‌మే కాదు.. గ‌డిచిన కొద్ది కాలంగా సాగుతున్న డేటింగ్ ప‌క్క‌న పెట్టేసి.. అంద‌రి ఎదుట అధికారికంగా పొలిటిక‌ల్ ఎంగేజ్ మెంట్ కానుంది. తాజా భేటీ త‌ర్వాత నుంచి కాంగ్రెస్ కూట‌మిలోకి బాబు ఎంట్రీ ఇస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. దీని రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది కాల‌మే స‌రైన స‌మాధానం చెప్ప‌గ‌ల‌దు.