Begin typing your search above and press return to search.
8 వేల పెట్టుబడితో యువతకు గాలమేస్తున్న టీడీపీ!
By: Tupaki Desk | 4 Feb 2019 4:18 PM GMTఉత్తరాంధ్రలోని ఓ జిల్లా టీడీపీ ఆఫీసులోకి ఊసుపోక వెళ్లాడో వ్యక్తి. గేటు తీసుకుని ఇలా అడుగుపెట్టాడో లేదో.. ప్యాంటు నడుం మీదకెత్తుకుంటూ ఓ నడివయసు వ్యక్తి వచ్చాడు.
‘మొబైల్ కావాలా’ వినీవినపడనట్లుగా... అర్థమయ్యీకానట్లుగా అస్పష్టంగా అడిగాడు.
‘ఆఁ... ఏంటీ?’ ప్రశ్నించాడా బయట నుంచి వచ్చిన కొత్త వ్యక్తి.
ఏంటీ అన్న మాటతో అతను అక్కడివాడు కాదనుకున్నాడో ఏమో.. ‘ఎవరు కావాలి సార్’ అంటున్నానండీ అంటూ కవర్ చేసేశాడు ఆ పార్టీ ఆఫీసులోని వ్యక్తి.
.....ఏదో తేడాగా ఉంది వ్యవహారం అనుకుంటూ అటూఇటూ ఆఫీసు చూస్తున్నట్లుగా చేసి మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ మూసేసిన భారీ తలుపు ముందు వందల కొద్దీ చెప్పుల జతలు కనిపించాయి.
మెల్లగా తలుపు తోసి చూసేసరికి వందల మంది కుర్రాళ్లు కనిపించారు.
‘మీటింగేమైనా అవుతుందా లోపల’ అని అక్కడున్నవారిని అడిగాడా కొత్త వ్యక్తి.. ‘ట్రైనింగ్ అవుతుందని చెప్పడంతో బయటకు వచ్చేసి తనకు తెలిసిన ఓ టీడీపీ లీడర్ కే ఫోన్ కొట్టాడు. ఆ మాటాఈమాటా మాట్లాడి పార్టీ ఆఫీసులో ఏం జరుగుతోందని అడిగేసరికి ఆయన అసలు సంగతి చెప్పాడు.
ఇక్కడే ఉన్నానంటూ వచ్చి జరిగేదంతా చూపించాడు.
విషయమేంటంటే టీడీపీ సోషల్ మీడియా వింగ్ కు పార్టీ ఆఫీసు ప్రధాన అడ్డా. చంద్రబాబుకు బాకా ఊదే మెటీరియల్ తో పాటు - వైసీపీని విమర్శిస్తూ - దూషిస్తూ చేయాల్సిన పోస్టులు అక్కడ తయారుకావడంతో పాటు కొన్ని పైనుంచి వస్తాయి. వాటిని అక్కడి నిర్వాహకులు అక్కడ పోగయిన కుర్రాళ్లతో ఏర్పాటుచేసిన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తుంటే వారు రెచ్చిపోయి తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తుంటారు.
మరి, ఈ యూత్ అంతా స్వచ్ఛందంగా వస్తున్నారా?
అలా వస్తే గేటు తీసుకొని వచ్చిన కొత్త వ్యక్తిని ‘మొబైల్ కావాలా’ అని ఎందుకు అడుగుతారు.
అసలు విషయం అర్థమైంది కదా. మొబైల్ ఫోన్ ఎరచూపి కుర్రాళ్లను పార్టీ సోషల్ మీడియా పనులు అప్పగించి షిప్టులవారీగా వారితో పనిచేయించుకుంటున్నారు.
స్మార్ట్ ఫోన్లంటే కుర్రాళ్లకు మోజు. ఆరేడు గంటలు పార్టీ కోసం దాంతో పనిచేసినా ఆ తరువాత వారు తమకు నచ్చినట్లు దాన్ని వాడుకోవచ్చు. ఈ బలహీనతనే ఆసరా చేసుకుని రూ.6 వేల నుంచి రూ8 వేల ధరలో ఫోన్లను కొనిచ్చి మరీ టీడీపీ యూత్‌ను ఇలా రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
దీనివల్ల కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు - చిన్నచిన్న పనులు చేసుకునే యువత - పరీక్షలకు చదువుకోవాల్సినవారు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నట్లు తెలుస్తోంది.