Begin typing your search above and press return to search.
అన్నింటికి ఎన్టీవోడు కాదు చంద్రబాబే
By: Tupaki Desk | 8 Oct 2015 4:35 AM GMTఏపీ అధికారపక్షమైన తెలుగు దేశం పార్టీలో ఒక కీలక పరిణామం చాప కింద నీరులా సాగిపోతోంది. ఇప్పటివరకూ ఆ పార్టీ అనుసరించిన విధానానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ పార్టీని స్తాపించిన ఎన్టీఆర్ కు పెద్ద పీట వేస్తూ.. తాము అధికారంలోకి వస్తే.. తమ సర్కారు చేపట్టే పథకాలకు ఎన్టీఆర్ పేరుకు పెద్దపీట వేసే స్థానే.. ఇప్పుడు చంద్రబాబు పేరును షార్ట్ కట్ చేసి.. ‘‘చంద్రన్న’’ బ్రాండ్ ను ప్రమోట్ చేసే పనిలో బిజీ అయ్యింది.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలకు చంద్రన్న పేరుతో ఇవ్వటమే కాక.. వాటి జోరు పెంచటం చూస్తుంటే.. ఎన్టీవోడి పేరును పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కనుక నెహ్రూ.. ఇందిరలను కాలానుగుణంగా తప్పించి.. రాజీవ్ పేరును వీలైనన్ని ఎక్కువ పథకాలకు పెట్టేలా చేయటంతో అధినేత్రి సోనియాగాంధీ మనసును గెలుచుకునే ప్రయత్నం జరిగింది.
ఇప్పుడు తెలుగుదేశంలో తర్వాతి తరానికి పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్ననేపథ్యంలో.. చంద్రబాబు పేరును బ్రాండ్ గా మార్చే ప్రయత్నంలో ఏపీ అధికారపక్షం తహతహలాడుతోంది. తర్వాత తరానికి తానే పెద్ద దిక్కుగా కనిపించాలన్న ఆలోచన చంద్రబాబులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పేరును అవసరానికి మాత్రమే వాడుకునేలా.. మిగిలిన అన్ని సందర్భాల్లో తన పేరునే ఎక్కువగా వినియోగించేలా పావులు కదుపుతున్నారు.
ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. తన పేరు మీద పథకాలు అమలయ్యేలా చేయటం ఏపీ సీఎంకే చెల్లిందని చెప్పాలి. మారుతున్న తరానికి తగ్గట్లుగా బ్రాండ్ పేరు కూడా మారాలన్న ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రన్న సంక్రాంతి కానుకతో మొదలైన ఈ వ్యవహారం.. చంద్రన్న తోఫా.. రైతు కోసం చంద్రన్న.. చంద్రన్న వ్యవసాయ క్షేత్ర పరిశీలన.. చంద్రన్న సంక్షేమం.. చంద్రన్న విజయాలు ఇలా.. పథకం.. కార్యక్రమం ఏమైనా సరే.. ‘‘చంద్రన్న’’ పేరు మాత్రం తప్పనిసరి అన్నట్లుగా మారింది. కాలంతో పాటు.. మార్పు అనివార్యమంటే ఇదేనేమో.