Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ త‌న‌ను తాను పిసుక్కున్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   30 Nov 2017 5:01 AM GMT
మ‌ళ్లీ త‌న‌ను తాను పిసుక్కున్న చంద్ర‌బాబు
X
నిజ‌మే.. తొమ్మిదిన్న‌రేళ్లు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు కొన్ని ప‌నులు జ‌రుగుతాయి. అది మామూలే. అయితే.. జ‌రిగిన ప్ర‌తి మంచిని లెక్క‌కు మిక్కిలిగా గొప్ప‌లు చెప్పుకోవ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల‌వాటు. ఈ త‌ర‌హా గొప్ప‌లు ఎబ్బెట్టుగా మారిన‌ట్లుగా అనిపిస్తున్నా.. త‌న గొప్ప‌ల మీద జోకులు వేసుకుంటున్నా ప‌ట్టించుకోకుండా త‌న‌ను తాను గొప్ప‌గా అభివ‌ర్ణించుకోవ‌టం ఏపీ ముఖ్య‌మంత్రిలో క‌నిపిస్తుంది.

ఎవ‌రినైనా మెచ్చుకోలుతో ప‌డేయొచ్చంటారు. బాబు విష‌యంలో ఇది కాస్త భిన్నం. ఆయ‌న్ను ఎవ‌రూ మెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎందుకంటే.. ఆ ఛాన్స్ ను బాబు ఎవ‌రికీ ఇవ్వ‌రు. గడిచిన రెండు రోజులుగా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వార్త‌ల్లో నానుతోంది. జీఈఎస్ స‌ద‌స్సుతో పాటు మెట్రోరైలు ప్రారంభంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్న వేళ‌.. బాబు త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

ఈ రెండింటికి సంబంధించి త‌న పాత్ర గురించి గొప్ప‌లు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న క‌ష్టాన్ని రిజిస్ట‌ర్ చేసుకోవ‌టం త‌ప్పు కాదు కానీ.. ఇప్పుడున్న ప‌రిస్థ‌తుల్లో బాబు గొప్ప‌ల‌కు ఆద‌ర‌ణ ల‌భించే ప‌రిస్థితి లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఆద‌ర‌ణ కంటే అప‌హాస్య‌మ‌య్యే ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌లో కామ్ గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. బాబు తీరు వేరు. ఆయ‌న త‌న‌ను తాను గొప్ప‌గా అభివ‌ర్ణించుకునేందుకు తెగ ట్రై చేస్తారు. ఇందుకు త‌గ్గ‌ట్లే బుధ‌వారం నాటి మీడియా స‌మావేశంగా చెప్పాలి.

ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌న తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న గురించి చెప్పుకున్న చంద్ర‌బాబు.. హైద‌రాబాద్ లో మెట్రో రైలును ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నించిందే తాన‌న్న విష‌యాన్ని చెప్పుకున్నారు. వాజ్ పేయ్ ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న అనంత‌కుమార్ హైద‌రాబాద్ వ‌దిలేసి బెంగ‌ళూరు.. అహ్మ‌దాబాద్‌ ల‌కు మెట్రో మంజూరు చేశార‌ని.. ఈ స‌మ‌యంలో తాను కేంద్రంతో పోరాడిన‌ట్లుగా చెప్పారు.

ఢిల్లీ మెట్రో రూప‌శిల్పి శ్రీ‌ధ‌ర‌న్‌ ను హైద‌రాబాద్ మెట్రో నిర్మాణంపై అధ్య‌యానికి తీసుకున్నామ‌ని.. అయితే అప్ప‌ట్లో త‌మ ప్ర‌భుత్వం స్థానే వైఎస్ అధికారంలోకి వ‌చ్చార‌న్నారు. వైఎస్ కార‌ణంగా ప్రాజెక్టు ఆల‌స్య‌మైంద‌ని.. ప్రాజెక్టు ఇంత ఆల‌స్యం కావ‌టానికి వైఎస్సే కార‌ణంగా అభివ‌ర్ణించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వైఎస్ కార‌ణంగా మెట్రో ప్రాజెక్టు ఆల‌స్య‌మైంద‌న్న‌ది ఆరోప‌ణ అయితే.. రియ‌ల్ గా మెట్రో ఆల‌స్యానికి కార‌ణం ఎవ‌రో అంద‌రికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారును.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప‌ల్లెత్తి మాట అనే ధైర్యం చేయ‌ని చంద్ర‌బాబు దివంగ‌త నేత వైఎస్‌ను త‌ప్పు ప‌ట్టారే కానీ.. దాదాపు రెండేళ్ల‌కు పైనే మెట్రో రైలు ప‌ట్టాల మీద‌కు ఎక్క‌క‌పోవ‌టాని కార‌ణంగా ఆరోపించే కేసీఆర్ స‌ర్కారు గురించి మాట వ‌ర‌స‌కు కూడా విమ‌ర్శించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. జీఈఎస్ స‌ద‌స్సును నిర్వ‌హించిన హెచ్ ఐసీసీ ప్రాంగ‌ణం త‌న హ‌యాంలో నిర్మించిందేన‌ని గుర్తు చేశారు. సాధార‌ణంగా ఎవ‌రో ఒక‌రు పొగుడుతుంటారు. కానీ.. బాబు తీరు వేరు. ఆయ‌న ఆ అవ‌కాశాన్ని ఎవ‌రికి ఇవ్వ‌కుండా త‌న‌ను తానే పొగిడేసుకుంటారు. బాబా మ‌జాకానా?